విశాల్ తో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతున్న సమంతా

226

రీసెంట్ గా తమిళ్ లో “తుప్పరివాలన్” అనే మూవీ తో థ్రిల్లింగ్ హిట్ ని అందుకున్నాడు హీరో విశాల్. అదే మూవీ రెండు నెలల తరువాత తెలుగు లో “డిటెక్టివ్” గా రిలీజ్ అయ్యి ఇక్కడ కూడా సక్సెస్ టాక్ ని తెచ్చుకుంది. సో మళ్ళి చాలా కాలం తరువాత సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన విశాల్ ఇప్పుడు తన నెక్స్ట్ మూవీ యొక్క ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసాడు. అవును విశాల్ “అభిమన్యుడు” అనే మరొక థ్రిల్లర్ లో నటిస్తున్నాడు. పి.ఎస్ మిత్రన్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ లో స్టార్ హీరోయిన్ అయిన సమంతా హీరోయిన్ గా నటిస్తుంది. ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ మీద ఈ మూవీ మొత్తం తెరకెక్కనుంది అంట. విశాల్ సొంత బ్యానర్ అయిన విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పై నిర్మిస్తున్న ఈ మూవీ కి యువన్ శంకర్ రాజ సంగీతాన్ని అందిస్తున్నాడు. తెలుగు ఇంకా తమిళ బాషల్లో ఏకకాలం లో తెరకెక్కుతున్న ఈ మూవీ పై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఇన్ని రోజులు కమర్షియల్ మాస్ సినిమాలు చేసిన విశాల్ మార్పు కోరుకొని ఇలాంటి కొత్తదనంతో కూడిన సినిమాలు సెలెక్ట్ చేసుకోవడం విశేషం. ఈ మూవీకి ఇంకో విశేషం ఏంటి అంటే పెళ్లి తరువాత సమంతా ఓకే చేసిన ఫస్ట్‌ మూవీ ఇదే.

NEWS UPDATES

CINEMA UPDATES