పిల్లల్ని కనాలి అనే ఉంది కానీ…

784

అక్కినేని నాగ చైతన్యకి, సమంతా కి పెళ్లి అయ్యి దాదాపు ఏడాది కావొస్తుంది. అయితే వళ్ళు తమ తమ సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. సమంతా అయితే ఈ ఏడాది నాలుగు అయిదు సినిమాలు రిలీజ్ చేసి బిజీగా ఉంది. సమంతా నటిస్తున్న లేటెస్ట్ సినిమా “యు టర్న్”. ఈ సినిమా రేపు గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియా తో ఇంటరాక్ట్ అయిన సమంతా ని పిల్లలు ఎప్పుడు అని అడిగారు మీడియా మిత్రులు. సమంతా వారికి జవాబు ఇస్తూ, “పిల్లలు ఆంటే నాకు చాలా ఇష్టం, కనాలి అని నేను కూడా అనుకుంటున్నా. కానీ చైతు ఇప్పుడే పిల్లలు గురించి కోనేళ్ళు అయ్యాక ఆలోచిద్దాం అని అన్నాడు. చై అలా అనగానే నేను చాలా ఫీల్ అయ్యాను కాని ఏదైనా మన మంచికోసమే కదా అని చెప్పి చై మాటకి కట్టుబడి చైతు ని ఎప్పుడు పిల్ల విషయంలో ఇబ్బంది పెట్టలేదు” అని చెప్పుకొచ్చింది సమంతా. ఇంకా మీరు నన్ను పిల్లలు గురించి అడగాలి అనుకుంటే వెళ్లి చైతు నే అడగండి అంటూ నాగ చైతన్య ని ఇరకాటం లో పెట్టేస్తుంది సమంతా. ఇకపోతే నాగ చైతన్య హీరోగా నటిస్తున్న “శైలజా రెడ్డి అల్లుడు” కూడా రేపే గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది.

NEWS UPDATES

CINEMA UPDATES