హీరోగా కమెడియన్…. మ్యూజిక్‌ డైరెక్టర్ గా హీరో!

221

ఒక కమెడియన్ హీరో అయ్యాడు. అదే సినిమా కోసం మరో హీరో.. సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు. కాకపోతే.. ఇది మన టాలీవుడ్ లో కాదులెండి. తమిళ్ లో.. కమెడియన్ గా మాంఛి డిమాండ్ ఉన్న సంతానం.. ఇప్పుడు హీరోగా మారాడు. జీఎల్ సేతురామన్ దర్శకత్వంలో.. వైభవి హీరోయిన్ గా.. చక్క పోడు పోడు రాజా అంటూ సినిమా పూర్తి చేశాడు. ఈ సినిమాకు.. మల్టీ టాలెంటెడ్ హీరో శింబు.. మ్యూజిక్ ఇచ్చాడు.

సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా యూ/ఏ సర్టిఫికెట్ సాధించింది. ఈ నెల 22న విడుదలకు సిద్ధమవుతోంది. వివేక్, వీటీవీ గణేష్, రోబో శంకర్ లాంటి టాప్ కమెడియన్లు నటించిన ఈ సినిమా.. పక్కా 200 శాతం కమర్షియల్ అంశాలతో.. సూపర్ కామెడీ ఎంటర్ టైనర్ గా తీశామని.. కచ్చితంగా అందరినీ సాటిస్ఫై చేస్తుందని సంతానం చెప్పాడు.

తన షూటింగ్ లతో నిత్యం బిజీగా ఉండే.. శింబు.. తన సినిమాకు ఎంతో శ్రమటోర్చి సంగీతం ఇచ్చారని.. తన కోసం శింబు లాంటి హీరో వర్క్ చేయడం ఆనందంగా ఉందనీ.. సంతానం చెబుతున్నాడు.

NEWS UPDATES

CINEMA UPDATES