బిబిసి పొర‌పాటు…. శ‌శిక‌పూర్‌కి బ‌దులు రిషిక‌పూర్ చిత్రాలు

192

ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత న్యూస్ ఛానెల్….. బిబిసి పొర‌పాటు ప‌డింది. బాలీవుడ్ పాత త‌రం న‌టుడు, రొమాంటిక్ హీరో శ‌శిక‌పూర్ మ‌ర‌ణ‌వార్త‌ను త‌ప్పుగా ప్ర‌సారం చేసింది. శ‌శిక‌పూర్ కు బ‌దులుగా ….రిషిక‌పూర్ న‌టించిన చిత్రంలోని క్లిప్పింగ్‌ను ప్ర‌సారం చేసింది. 1976లో అమితాబ‌చ్చ‌న్ న‌టించిన క‌భీ క‌భీ అనే చిత్రంలో క్లిప్పింగ్‌ను మొద‌ట్లో ప్ర‌సారం చేశారు. ఆ త‌ర్వాత రిషిక‌పూర్ న‌టించిన చిత్రాల క్లిప్పింగ్‌ల‌ను టెలికాస్ట్ చేశారు. వార్త పూర్త‌య్యేలోపు ఒక్క‌సారి కూడా శ‌శిక‌పూర్ ఫోటోనుగానీ, సినిమా క్లిప్పింగ్‌ను గాని ప్ర‌సారం చేయ‌లేదు.

శ‌శిక‌పూర్, రిషికపూర్ ఇద్ద‌రూ క‌పూర్ కుటుంబానికి చెందిన ప్ర‌ఖ్యాత న‌టులే. అయితే శ‌శిక‌పూర్ అన్న‌ కొడుకు రిషిక‌పూర్‌. శ‌శి క‌పూర్ … రాజ్‌క‌పూర్ చిన్న త‌మ్ముడు కాగా రిషిక‌పూర్ రాజ్‌క‌పూర్ చిన్న‌ కొడుకు. ఈ విష‌యం బిబిసి వారికి తెలిసిన‌ట్లు లేదు. దీంతో ఈ పొర‌పాటు జ‌రిగింది.

భార‌త సినీ చ‌రిత్ర‌లో క‌పూర్ ఫ్యామిలీకి ప్ర‌త్యేక స్థానం ఉంది. పృథ్వీరాజ్ క‌పూర్ మొద‌లు ఇప్ప‌టి వ‌ర‌కూ నాలుగు త‌రాల న‌టులు ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూనే ఉన్నారు. శ‌శిక‌పూర్‌…పృథ్వీరాజ్ క‌పూర్ చిన్న కుమారుడు. రాజ్‌క‌పూర్‌, శ‌మ్మీ క‌పూర్‌ల త‌ర్వాత పృథ్వీరాజ్ క‌పూర్ దంప‌తుల‌కు జ‌న్మించిన శ‌శిక‌పూర్ చిన్న‌త‌నం నుంచే న‌ట‌న‌లో ఆస‌క్తి క‌న‌బ‌రిచి ఎన్నో హిట్ చిత్రాల్లో న‌టించాడు. హాలీవుడ్ చిత్రాల్లో న‌టించిన తొలి త‌రం బాలీవుడ్ న‌టుడు కూడా శ‌శిక‌పూరే కావ‌డం విశేషం. అటువంటి శ‌శిక‌పూర్ విష‌యంలో బిబిసి వంటి ప్ర‌ముఖ ఛానెల్ పొర‌పాటు ప‌డ‌డాన్ని భార‌త ప్రేక్ష‌కులు జీర్ణించుకోలేక‌పోయారు. సోష‌ల్ మీడియాలో బిబిసిని అవ‌హేళ‌న చేశారు.

NEWS UPDATES

CINEMA UPDATES