5 రోజుల దాడులు…1430 కోట్ల క‌లెక్ష‌న్‌

363

శ‌శిక‌ళ‌, ఆమె బంధువుల ఇళ్లు, కార్యాల‌యాల‌పై ఐటి దాడులు ముగిశాయి. 5 రోజుల పాటు జరిగిన ఈ దాడుల్లో 1430 కోట్ల రూపాయ‌లు ప‌న్ను ఎగ‌వేసిన‌ట్లు అధికారులు ధృవీక‌రించారు.

చెన్నైతో పాటు ప‌లు ప్రాంతాల్లో విస్త‌రించిన శ‌శికళ వ‌ర్గీయుల వ్యాపార‌ సామ్రాజ్యాన్నిఐటి అధికారులు జ‌ల్లెడ ప‌ట్టారు. అనేక కీల‌క ప‌త్రాల‌ను స్వాధీనం చేసుకున్నారు. అధికారులు స్వాధీనం చేసుకున్న వాటిలో 7 కోట్ల న‌గ‌దు, 5 కోట్లు విలువ చేసే బంగారం ఉన్న‌ట్లు అధికారులు తెలిపారు.

తాము చేప‌ట్టిన సోదాలలో చాలా వ‌జ్రాలు ల‌భ్య‌మ‌య్యాయ‌ని వాటి విలువ‌ను అంచ‌నావేయిస్తున్నామ‌ని అధికారులు తెలిపారు. అదే విధంగా 15 బ్యాంక్ లాక‌ర్ల‌ను సీజ్ చేశామ‌ని…చాలా వ‌ర‌కు బ్యాంక్ అకౌంట్ల‌ను స్థంభింప‌చేశామ‌ని అధికారులు తెలిపారు.

శ‌శిక‌ళకు ఆమె బంధువుల‌కు సంబంధించిన అనేక షెల్ కంపెనీల‌పై ప‌క్కా సమాచారంతో రంగంలో దిగిన ఐటి అధికారులు సోదాలు చేప‌ట్టారు. విదేశాల్లో ఉన్న లింకుల‌ను బ‌య‌ట‌పెట్టేందుకు మ‌రొకొన్ని బృందాలు రంగంలోకి దిగ‌నున్నాయి.

ప్ర‌స్తుతం చేప‌ట్టిన సోదాల్లో దాదాపు 1800 మంది ఐటి అధికారులు 187 ప్రాంతాల్లో దాడులు చేసి విలువైన ప‌త్రాల‌ను స్వాధీనం చేసుకున్నారు.
త‌మిళ‌నాడుతో పాటు క‌ర్ణాట‌క‌, హైద‌రాబాద్‌, ఢిల్లీ, బెంగ‌ళూర్‌, పుదుచ్ఛేరి ప్రాంతాల్లో కూడా దాడులు చేశారు.

NEWS UPDATES

CINEMA UPDATES