బాయ్‌ఫ్రెండ్‌తో శృతిహాస‌న్ చెట్టాప‌ట్టాల్‌|

202

హీరోయిన్ శృతి హాసన్‌కి చేతినిండా సినిమాలు లేవు. కానీ ఆమెకి మాత్రం ప్ర‌చారం మాత్రం పుల్‌గా వ‌స్తోంది. 30 దాటిన హీరోయిన్ అంటే సినిమావాళ్ల‌కు చేదు. కానీ అనుష్క‌,స‌మంతా,కాజ‌ల్‌,శ్రియ సినిమాలు చేస్తున్నారు. కానీ శృతిహాస‌న్ ఎందుకో ఏమో? ప్రేమ పెళ్లిపై దృష్టిపెట్టింద‌నే టాక్ విన్పిస్తోంది. ఇదే నిజ‌మేన్న‌ట్లు బాయ్‌ఫ్రెండ్‌తో క‌లిసి తెగ షికార్లు కొడుతోంది. మొన్న‌టికి మొన్న అమ్మ సారిక‌,బాయ్‌ఫ్రెండ్ మైకేల్‌తో క‌లిసి రెస్టారెంట్ ద‌గ్గ‌ర క‌న‌ప‌డింది.

తాజాగా శృతి హాసన్, మైఖేల్ కోర్సెల్ కలిసి చెన్నైలో జరిగిన నటుడు అధవ్, వినోదిని పెళ్లి వేడుకలో సందడి చేశారు. ఈ వేడుకకు పంచెకట్టులో హాజరైన మైఖేల్…. కమల్ హాసన్‌తో కలిసి కనిపించాడు.మైఖేల్ కోర్సల్ కొన్ని రోజులుగా తన ప్రియురాలు శృతి హాసన్ తో కలిసి ఇండియాలోనే ఉంటున్నారు. ఇపుడు ఏకంగా తమిళ సాంప్రదాయ దుస్తువుల్లో శృతి హాసన్, కమల్ హాసన్తో కలిసి పెళ్లి వేడుకకు హాజరు కావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యం ఏమి కావాలని గుసగుసలు వినిపిస్తున్నాయి.

NEWS UPDATES

CINEMA UPDATES