కేంద్ర మంత్రి పై ఎఫ్.ఐ.ఆర్ న‌మోదు

378
siddaramaiah anantkumar hegde central minister cheif minister F.I.R mysore court

కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే… క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి సిద్ధ‌రామ‌య్య‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేశారు. సిద్ధ‌రామ‌య్య ఓట్ల కోసం ఏమైనా చేస్తార‌ని…ఆఖ‌రికి బూట్లు నాక‌డానికైనా సిద్ధ‌మేన‌ని మంత్రి అనంత్ కుమార్ హెగ్డే అన్నారు.

బెల్గావీలో బిజెపి చేప‌ట్టిన ప‌రివ‌ర్త‌న్ ర్యాలీలో అనంత్ కుమార్ ఈ అనుచిత‌ వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు మైసూరు జిల్లా కోర్టును ఆశ్ర‌యించారు. దీంతో కోర్టు స్పందించింది. మంత్రిపై ఎఫ్‌.ఐ.ఆర్ న‌మోదు చేయాల‌ని పోలీసుల‌ను ఆదేశించింది.

ఇండియ‌న్ పీన‌ల్ కోడ్ లోని 153, 504 సెక్ష‌న్ల ప్ర‌కారం మంత్రిపై ఎఫ్ ఐ ఆర్ న‌మోదు చేశారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు మంత్రి వ్యాఖ్య‌ల‌పై మండిప‌డుతున్నారు. మంత్రి వెంట‌నే క్ష‌మాణ‌లు చెప్పాల‌ని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

గ‌తంలో కూడా అనంత్ కుమార్ హెగ్డే అనేక వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. తాజా గా ఆయ‌న చేసిన వ్యాఖ్యలు శృతి మించాయి. ఇదిలా ఉంటే సిద్ధ‌రామ‌య్య కూడా మంత్రిపై విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టారు. అనంత్ కుమార్ హెగ్డే… గాడ్సేకు వార‌సుడ‌ని వ్యాఖ్యానించారు.

NEWS UPDATES

CINEMA UPDATES