చిన్న సినిమాలు కూడా తగ్గనంటున్నాయి

292

రిలీజ్ డేట్ విషయంలో బన్నీ, మహేష్ సినిమాల మధ్య వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. బన్నీ ఎనౌన్స్ చేసిన ఏప్రిల్ 27 తేదీనే మహేష్ కూడా ప్రకటించాడు. దీంతో ఈ తేదీ కోసం నా పేరు సూర్య, భరత్ అనే నేను నిర్మాతల మధ్య వాగ్వాదంతో పాటు చర్చలు కూడా సాగుతున్నాయి. అవంటే పెద్ద సినిమాలు.. రిలీజ్ డేట్ కోసం పోటీపడుతున్నాయి. మార్కెట్ తో పాటు కాస్త ఇగో క్లాషెష్ కూడా ఉంటాయి.

కానీ ఆశ్చర్యకరంగా చిన్న సినిమాలు కూడా తగ్గడం లేదు. ఒకే తేదీ కోసం కొట్టుకుంటున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా డజను సినిమాలు ఒకే రోజు కోసం పోటీపడుతున్నాయి. థియేటర్ యాజమాన్యాలు, డిస్ట్రిబ్యూటర్లతో పోటీపడి మరీ ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. ఇవన్నీ పోటీపడుతోంది ఈ వీకండ్ కోసమే. అవును.. ఈ వీకెండ్ (నవంబర్ 17) ఏకంగా 12 సినిమాలు బరిలో నిలిచాయి. వాటిలో ఏవి పక్కాగా థియేటర్లలోకి వస్తాయో తెలియాలంటే మరో 2 రోజులు ఆగాల్సిందే.

రిలీజ్ కు రెడీ అయిన ఆ 12 సినిమాలు

 1. ఖాకీ
 2. లండన్ బాబులు
 3. గృహం
 4. దేవిశ్రీప్రసాద్
 5. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం
 6. స్నేహమేరా జీవితం
 7. జస్టిస్ లీగ్
 8. లవర్స్ క్లబ్
 9. డేర్
 10. ప్రేమతో మీ కార్తీక్
 11. ది లాస్ట్ హారర్
 12. బేబి

NEWS UPDATES

CINEMA UPDATES