38 ఏళ్ళ తరువాత సౌదీలో సినిమా ప్రదర్శనలు

5521

సినిమాలు చూడడం ఇస్లాం మతానికి, సంస్కృతికి విరుద్దమని సౌదీ అరేబియాలో 1980 నుంచి సినిమా థియేటర్లలో ప్రదర్శనలను నిలిపివేశారు.

 

యువరాజు మ‌హ‌మ్మ‌ద్ బిన్ స‌ల్మాన్ అధికారం చేపట్టాక అనేక అభ్యుదయ కార్యాక్రమాలను చేపట్టినట్టే ప్రజలకు వినోదాన్ని అందించే సినిమా ప్రదర్శనలను కూడా ఈ నెల 18వ తారీఖు నుంచి ప్రారంభించనున్నారు. ఎప్పుడో 38 ఏళ్ళ క్రితం మూతపడ్డ సినిమా థియేటర్లు ఇప్పుడు ప్రారంభంకానుండంతో సౌదీ పౌరులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.సౌదీ అరేబియా గ‌త ఏడాది నుంచి అభ్యుద‌య ప‌థంలో అడుగులు వేస్తోంది. మ‌హిళ‌ల‌ను ప్ర‌ధాన స్ర‌వంతిలోకి తీసుకురావ‌డానికి ప్ర‌య‌త్నిస్తోంది. ఆ క్ర‌మంలో యువ‌రాజు ఇటీవల ఒక ప్ర‌క‌ట‌న చేశారు. మ‌హిళ‌ల‌కు కూడా మ‌గ‌వాళ్ల‌తోపాటు స‌మాన వేత‌నాలు ఇవ్వాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు అమెరికా ఆధారిత టెలివిజ‌న్‌కు విడుద‌ల చేసిన‌ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు యువ‌రాజు మ‌హ‌మ్మ‌ద్ బిన్ స‌ల్మాన్‌.

దీనితోపాటుగా మ‌హిళ‌ల వ‌స్త్ర‌ధార‌ణ విష‌యంలో కూడా వెసులుబాటునిచ్చారు. ఆడ‌వాళ్లు, కానీ మ‌త నిబంధ‌న‌ల‌లో మ‌గ‌వాళ్లు కానీ హుందాగా, గౌర‌వ‌ప్ర‌దంగా దుస్తులు ధ‌రించాల‌ని ఉంది. అంతే కానీ త‌ప్ప‌ని స‌రిగా న‌ల్ల‌ని అభ‌య ధ‌రించి తీరాల‌నే ష‌ర‌తు లేద‌న్నారు. గ‌త ఏడాదిగా సౌదీ అరేబియాలో మ‌హిళ‌ల మీద ఉన్న ఆంక్ష‌లు ఒక్క‌టొక్క‌టిగా తొల‌గిపోతున్నాయి.

స్టీరింగ్ చేతికొచ్చింది!

గ‌త ఏడాది సౌదీ మ‌హిళ‌ల‌కు తొలి వ‌రంగా డ్రైవ్ చేయ‌డం మీద ఉన్న నిబంధ‌న‌ల‌ను ఎత్తివేశారు. ఆ త‌ర్వాత స్పోర్ట్స్ స్టేడియంల‌కు వ‌చ్చి ఆట‌ల‌ను చూడ‌డానికి అవ‌కాశం వ‌చ్చింది. మిలిట‌రీలో మ‌హిళ‌ల సేవ‌ల‌కు దారులు పడ్డాయి. మార‌థాన్‌లో పాల్గొనే వెసులుబాటు వ‌చ్చింది. ఇస్పుడు దుస్తుల మీద ఆంక్ష‌లు ఎత్తి వేస్తూ ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. అలాగే స‌మాన వేత‌నం గురించిన ప్ర‌క‌ట‌న కూడా. ఈ సంద‌ర్భంగా యువ‌రాజు మాట్లాడుతూ ప్ర‌పంచంతోపాటే మేము కూడా అన్నారు.

అభ్యుద‌యానికి బీజం!

సౌదీ అరేబియాలో మ‌హిళ‌ల ప‌ట్ల ఆంక్ష‌లు మెండుగా ఉండేవి. ఇస్లామేత‌ర మ‌హిళ‌లు అయినా ఆ దేశంలో బుర‌ఖా ధ‌రించాల్సిందే. ఇత‌ర శాంతి భ‌ద్ర‌త‌ల విష‌యంలోనూ నియ‌మాలు క‌ఠినంగానే ఉండేవి. అందుకే నేరాల సంఖ్య కూడా త‌క్కువ‌గా ఉంటుంద‌ని ప్ర‌పంచం కూడా న‌మ్మేది. అయితే మ‌హిళ‌ల విష‌యానికి వ‌స్తే ఆంక్ష‌ల పంజ‌రం ఎంత గ‌ట్టిగా ఉన్న‌ప్ప‌టికీ స్వేచ్ఛ కోరుకునే విహంగాలు పంజరం సందుల్లోంచి అయినా స‌రే రెక్క‌ల‌ను బ‌య‌ట‌కు చాచి తీరుతాయి. సౌదీలో మ‌హిళా యాక్టివిస్టులు అదే ప‌ని చేశారు. మ‌హిళ‌ల‌కు అనుకూలంగా చ‌ట్టాలు కావాల‌ని, ఆంక్ష‌ల పంజ‌రాలు వ‌ద్ద‌ని గ‌ళం విప్పారు. వారిలో తొలి మ‌హిళ వాజేహా అల్ హ‌వైద‌ర్‌. ఆమె చేసిన పోరాట‌మే ఈనాటి అభ్యుద‌య ప‌థానికి బీజం.

సౌదీ అరేబియాలో మ‌హిళ‌ల పట్ల ఉన్న ఆంక్ష‌లు ఒక్కొక్క‌టిగా తొల‌గుతున్నాయి. టాక్సీ డ్రైవ‌ర్లుగా మ‌హిళల‌కు అవ‌కాశం క‌ల్పించ‌డం వంటి నిర్ణ‌యాలు తీసుకున్న సౌదీ ప్ర‌భుత్వం ఇటీవల మ‌హిళ‌లు ఫుట్‌బాల్ మ్యాచ్‌లు చూసేందుకు అడ్డును తొల‌గించింది. కుటుంబ స‌మేతంగా మ్యాచ్‌లు తిల‌కించేందుకు అనుమ‌తిని ఇచ్చింది.

ఫుట్‌బాల్ మ్యాచ్‌లు తిల‌కించే అవ‌కాశం కొన్ని ద‌శాబ్ధాలుగా కేవలం పురుషుల‌కు మాత్ర‌మే ఉంది. ఈ అవ‌కాశాన్ని మ‌హిళ‌ల‌కు కూడా క‌ల్పించే ఉద్దేశ్యంతో జెడ్డాలో కొద్ది రోజుల క్రితం జ‌రిగిన ఒక మ్యాచ్‌కు మ‌హిళ‌ల‌ను అనుమతించారు. కింగ్ అబ్ధుల్లా స్పోర్ట్ స్టేడియంలో జ‌రిగిన మ్యాచ్‌ను ప్ర‌త్య‌క్షంగా చూసిన మ‌హిళ‌లు ఎంతో ఆనందాన్ని వ్య‌క్తం చేశారు. స్టేడియంలో మ‌హిళ‌లు ప్ర‌వేశించ‌డానికి ప్ర‌త్యేక ద్వారాలు ఏర్పాటు చేస్తున్నారు. వారి కోసం ప్ర‌త్యేక రెస్ట్ రూమ్‌ల‌ను కూడా ఏర్పాటు చేశారు.

NEWS UPDATES

CINEMA UPDATES