సఫారీగడ్డపై టీమిండియా టీ-20 వేట…..

972
  • తీన్మార్ టీ-20 సిరీస్ కు టీమిండియా, సౌతాఫ్రికా రెడీ
  • సూపర్ సండే ఫైట్ గా వాండరర్స్ లో తొలిసమరం
  • ఫేస్ టు ఫేస్ రికార్డుల్లో టీమిండియాదే పైచేయి
  • సఫారీలపై 10 మ్యాచ్ ల్లో 6 విజయాలు

దక్షిణాఫ్రికాలో టీమిండియా సఫారీవేట…ముగింపుదశకు చేరింది. వన్డే సిరీస్ లో 5-1తో విజయం సాధించిన విరాట్ సేన… తీన్మార్ టీ-20 సిరీస్ లో సైతం క్లీన్ స్వీప్ విజయానికి ఉరకలేస్తోంది. జోహెన్స్ బర్గ్ న్యూవాండరర్స్ స్టేడియం వేదికగా జరిగే సూపర్ సండే ఫైట్ లో టీమిండియా హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. 

వన్డే సిరీస్ లో టీమిండియా షో….

సౌతాఫ్రికాలో రెండుమాసాల…. టీమిండియా మూడు ఫార్మాట్ల సిరీస్ వేట…ముగింపు దశకు చేరింది. తొలిదశ టెస్ట్, రెండోదశ వన్డే సిరీస్ లు మిశ్రమఫలితాలతో ముగియడంతో… ఇక…తీన్మార్ టీ-20 సిరీస్ సమరానికి రెండుజట్లూ సై అంటే సై అంటున్నాయి.

ఆరుమ్యాచ్ ల వన్డే సిరీస్ ను 5-1తో అలవోకగా నెగ్గిన ఆత్మవిశ్వాసంతో …టీమిండియా మరోసారి హాట్ ఫేవరెట్ గా టీ-20 సిరీస్ వేటకు దిగుతుంటే… ఆతిథ్య సఫారీటీమ్ మాత్రం… జెపీ డుమ్నీ నాయకత్వంలో తన అదృష్టం పరీక్షించుకొంటోంది.

ఐసీసీ తాజా టీ-20 ర్యాంకింగ్స్ ప్రకారం టీమిండియా…మూడోస్థానంలో ఉంటే….సౌతాఫ్రికా ఆరో ర్యాంకులో కొనసాగుతోంది.

అంతేకాదు…టీ-20 ఫార్మాట్లో రెండుజట్ల ఫేస్ టు ఫేస్ రికార్డు చూసినా…టీమిండియాదే పైచేయిగా ఉంది.

2006లో తొలి టీ-20 సమరం

ఈ రెండుజట్లు 2006 సీజన్లో తొలిసారిగా ఓ టీ-20 మ్యాచ్ లో తలపడ్డాయి. అప్పటి నుంచి 2015 సిరీస్ ఆఖరి మ్యాచ్ వరకూ…. సౌతాఫ్రికాతో పదిసార్లు తలపడిన టీమిండియాకు ఆరు విజయాల రికార్డు ఉంది. మరోవైపు… సఫారీటీమ్ కు మాత్రం… పదిమ్యాచ్ ల్లో నాలుగే విజయాలు ఉన్నాయి.

హాట్ ఫేవరెట్ గా టీమిండియా…

ఇక…రెండుజట్ల ప్రస్తుత బలాబలాలను చూస్తే….విరాట్ కొహ్లీ, శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, ధోనీ, స్పిన్ జాదూలు కుల్దీప్, చాహల్, యార్కర్ల కింగ్ బుమ్రా లాంటి మొనగాళ్లున్న టీమిండియాకు…. డుమ్నీ నాయకత్వంలోని సౌతాఫ్రికా టీమ్ ఏమాత్రం పోటీ ఇవ్వగలదన్నది అనుమానమే. సీనియర్ స్టార్ ఏబీ డివిలియర్స్, డుమ్నీ స్థాయికి తగ్గట్టుగా  రాణించగలిగితేనే… టీమిండియాకు పోటీ ఇచ్చే అవకాశం ఉంటుంది.

మ్యాచ్ కు వేదికగా ఉన్న జోహెన్స్ బర్గ్…న్యూవాండరర్స్ స్టేడియంలో….ఇంతకుముందు ఆడిన ఐదోవన్డేలో విజయం సాధించిన ఆత్మవిశ్వాసంతో…సౌతాఫ్రికా…టీ-20 సమరానికి సిద్ధమవుతోంది.

భారత కాలమాన ప్రకారం ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఈ పోటీ ప్రారంభమవుతుంది.

NEWS UPDATES

CINEMA UPDATES