కొత్త వారితో శ్రీకాంత్ అడ్డాలా సినిమా ?

268

“కొత్త బంగారు లోకం” ఇంకా “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” మూవీ తో స్టార్ డైరెక్టర్‌గా ఇండస్ట్రీ లో మంచి పేరు తెచ్చుకున్నాడు శ్రీకాంత్ అడ్డాల. కాని మహేష్ బాబు తో తీసిన “బ్రహ్మోత్సవం” సినిమా భారీ ఫ్లాప్ అవ్వడంతో శ్రీకాంత్ అడ్డాలకు అవకాశాలు తగ్గాయి. ఇప్పటికే పలువురి నిర్మాతలతో కథా చర్చలు జరుపుతున్నా కూడా ఎవరు ఓకే చేయడం లేదు. అసలు ఇప్పుడు నిర్మాతలు ఎవరు శ్రీకాంత్ అడ్డాలని పట్టించుకోవట్లేదు. కాని స్టార్ ప్రొడ్యూసర్ అయిన అల్లు అరవింద్ మాత్రం శ్రీకాంత్ అడ్డాల ని నమ్మి ఒక సినిమా ని అప్పగించాడు అని తెలుస్తోంది.

గీత ఆర్ట్స్ బ్యానర్ తో త్వరలో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం లో ఒక మూవీ రానుంది. మళ్ళీ ఈ మూవీ తో శ్రీకాంత్‌ అడ్డాల తనని తానూ ప్రూవ్ చేసుకుందాం అనుకుంటున్నాడు. అందరూ కొత్త వారితో శ్రీకాంత్ అడ్డాల తీసే ఈ మూవీ ఈ నెలలోనే స్టార్ట్ అవ్వనుందట. అలాగే ఒక స్టార్ హీరో ఈ మూవీ లో కీ రోల్ లో నటించబోతున్నాడు అనే టాక్ కూడా బయట నడుస్తుంది. మరి ఈ మూవీ తో శ్రీకాంత్ అడ్డాల బౌన్స్ బ్యాక్ అవుతాడా లేదా చూడాలి.

NEWS UPDATES

CINEMA UPDATES