వీరనారిగా రాబోతున్న సన్నీ లియోన్…

169

కొన్నాళ్ల క్రితం పోర్న్ స్టార్ గా విపరీతమైన యుద్ధం చేసింది. తర్వాత.. సినిమాల్లో బిజీ అయ్యాక.. ఐటమ్ సాంగ్స్ తో రక్తి కట్టిస్తోంది. హీరోయిన్ గా ప్రూవ్ చేసుకుంటోంది. ఇలా.. ఇన్నాళ్లూ గ్లామర్ తోనే పిచ్చెక్కించిన సన్నీ లియోన్.. ఇప్పుడు కత్తి యుద్ధాలు కూడా చేస్తానంటోంది.

తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో.. వడివుడయన్ దర్శకత్వంలో ఓ సినిమా ఖరారైంది. యుద్ధ నేపథ్యం, విజువల్ ఎఫెక్ట్స్, భారీ హంగులు ఉన్న ఈ సినిమాలో.. సన్నీ లియోన్ ను వీర నారిగా చూపించబోతున్నారట. లీడ్ రోల్ చేయబోతున్న సన్నీ.. సినిమా కోసం యుద్ధ విద్యలు కూడా నేర్చుకోబోతోందట.

అంతే కాదు.. ఏకంగా 150 రోజుల పాటు.. తన డేట్స్ అన్నీ కేటాయించేసిందట. కథ బాగా నచ్చడంతోనే సినిమా ఒప్పుకున్నాననీ.. తన కెరీర్ ను మలుపు తిప్పే సినిమా అవుతుందని.. సన్నీ లియోన్ అప్పుడే నమ్మకంగా చెబుతోంది. ఆమె అనుకున్నట్టే సినిమా కూడా బాగా వస్తుందని యూనిట్ కూడా అంటోంది.

మరి.. శృంగార యుద్ధంలో రకరకాల హావభావాలు పలికించిన సన్నీ.. ఇప్పుడు అసలు సిసలు యుద్ధంలో ఎలాంటి వీరత్వాన్ని రక్తి కట్టిస్తుందో చూడాలని.. ఆమె అభిమానులు ఎదురుచూస్తున్నారు.

NEWS UPDATES

CINEMA UPDATES