వన్డే క్రికెట్లో పురుషులను మించిన మహిళలు

3702
  • మహిళా వన్డేల్లో న్యూజిలాండ్ సరికొత్త ప్రపంచ రికార్డు
  • ఐర్లాండ్ పై న్యూజిలాండ్ 4 వికెట్లకు 490 పరుగులు
  • సుజీ బేట్స్ 151, మాడీ గ్రీన్ 121 పరుగులు
  • 64 బౌండ్రీలు, 7 సిక్సర్లు బాదిన కివీ మహిళలు

మహిళా వన్డే క్రికెట్లో న్యూజిలాండ్ జట్టు సరికొత్త ప్రపంచ రికార్డు నమోదు చేసింది. 50 ఓవర్ల మ్యాచ్ లో 4 వికెట్లకు 490 పరుగుల స్కోరుతో చరిత్ర సృష్టించింది.

డబ్లిన్ వేదికగా ఐర్లాండ్ తో జరిగిన వన్డే మ్యాచ్ లో…సుజీ బేట్స్ నాయకత్వంలోని న్యూజిలాండ్ జట్టు ఈ ఘనతను సొంతం చేసుకొంది.

ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ ఎంచుకొన్న కివీస్ జట్టుకు ఓపెనర్లు సుజీ-గ్రీన్ జోడీ మొదటి వికెట్ కు 151 పరుగుల రికార్డు భాగస్వామ్యంతో అద్దిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు.

సుజీ, గ్రీన్ బాదుడే బాదుడు…

కెప్టెన్ సుజీ  94 బాల్స్ లో 24 బౌండ్రీలు, 2 సిక్సర్లతో 151 పరుగులు, మాడ్లిన్ గ్రీన్ 105 బాల్స్ లో 17 బౌండ్రీలు, 2 సిక్సర్లతో 121 స్కోర్లు సాధించారు. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ మహిళలు 7 సిక్సర్లు, 64 బౌండ్రీలతో చెలరేగిపోయారు. 21 సంవత్సరాల క్రితం క్రైస్ట్ చర్చి వేదికగా పాకిస్థాన్ తో ముగిసిన మ్యాచ్ లో తాము సాధించిన 455 పరుగుల ప్రపంచ రికార్డును అధిగమించి సరికొత్త ప్రపంచ రికార్డు నమోదు చేశారు.

పురుషుల టాప్ స్కోరు 444 పరుగులు…

పురుషుల వన్డే క్రికెట్లో 444 పరుగుల స్కోరే ప్రపంచ రికార్డు కాగా…మహిళల విభాగంలో న్యూజిలాండ్ 490 పరుగుల స్కోరుతో …పురుషులనే అధిగమించింది.

21సార్లు 400కు పైగా స్కోర్లు…

 ఇన్ స్టంట్ వన్డే చరిత్రలో ఇప్పటి వరకూ పురుషుల, మహిళల విభాగాలలో కలసి 21సార్లు మాత్రమే 400కు పైగా స్కోర్లు నమోదు కావడం మరో రికార్డు. మహిళల వన్డేల్లో మూడుసార్లు మాత్రమే…. 400కు పైగా స్కోర్లు ఉంటే… పురుషుల విభాగంలో వివిధ జట్లు 18సార్లు 400కు పైగా స్కోర్లు సాధించాయి.

NEWS UPDATES

CINEMA UPDATES