ఏషియాడ్ బంగారు కొండ స్వప్న బర్మన్ కష్టాలకు ఇక తెర !

747
  • స్వప్న ఆరువేళ్ల పాదాల కోసం స్పెషల్ ట్రాక్ షూ
  • స్వప్నకు తర్వలో బహుకరించనున్న స్పోర్ట్స్ అథారటీ ఆఫ్ ఇండియా
  • ఏషియాడ్ హెప్టాథ్లాన్ లో దేశానికి స్వర్ణం తెచ్చిన స్వప్న బర్మన్

ఆసియా క్రీడల గోల్డ్ మెడలిస్ట్, బెంగాల్ బుల్లెట్ స్వప్న బర్మన్…చిరకాల స్వప్నం ఎట్టకేలకు నేరవేరింది.

అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనటానికి అవసరమైన ప్రత్యేక బూట్లను… స్వప్న బర్మన్ కోసం ప్రత్యేకంగా తయారు చేయించి… కానుకగా ఇవ్వాలని కేంద్ర క్రీడామంత్రిత్వశాఖ నిర్ణయించింది.

సాధారణంగా… అందరికీ ఐదు వేళ్లతో కూడిన పాదాలే ఉంటాయి. అయితే… జల్పాయి గురికి చెందిన స్వప్న బర్మన్ మాత్రం.. . ఆరు వేళ్ల పాదాలతోనే జన్మించింది. బహుముఖ క్రీడలున్న హెప్టాథ్లాన్ లో పాల్గొనటానికి స్వప్న అష్టకష్టాలు పడుతూ ఉండేది. ఐదువేళ్ల పాదం కోసం తయారు చేసిన ట్రాక్ షూను… ఆరువేళ్ల పాదం కలిగిన స్వప్న ధరించిన సమయంలో…. భరించలేని నొప్పితో విలవిలలాడిపోతూ వచ్చింది.

చివరకు… జకార్తాలో ఇటీవలే ముగిసిన ఆసియా క్రీడల్లో సైతం… స్వప్న… ఇబ్బంది పడుతూ… నొప్పిని భరిస్తూనే బంగారు పతకం సాధించడం ద్వారా దేశానికే గర్వకారణంగా నిలిచింది.

స్వప్న కోసం… ప్రత్యేకంగా డిజైన్ చేసిన ట్రాక్ షూను ఇవ్వాలని నిర్ణయించినట్లు స్పోర్ట్స్ అథారటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ నీలం కపూర్ ప్రకటించారు.

NEWS UPDATES

CINEMA UPDATES