డిసెంబర్ 6 నుంచి సైరా

281

చిరంజీవి 151వ సినిమా పట్టాలపైకి వచ్చే డేట్ డిసైడ్ అయింది. ఇన్నాళ్లూ ప్రీ-ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చేనెల 6 నుంచి మొదలవుతుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మాతగా కొణెదల ప్రొడక్షన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో రాబోతోంది సైరా నరసింహారెడ్డి.

ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే హైదరాబాద్ తో పాటు గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో భారీ సెట్స్ రెడీ చేశారు. రెగ్యులర్ షూటింగ్ ఎక్కడ మొదలవుతుందనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. మరోవైపు ఈ సినిమాకు సంబంధించి చిరు మేకోవర్ కూడా పూర్తయింది. నాగచైతన్య, సమంతల వెడ్డింగ్ రిసెప్షన్ లో చిరంజీవి మేకోవర్ ఎలా ఉందో తెలిసిపోయింది. బాగా మీసాలు, గుబురు గడ్డం పెంచారు చిరు. మనిషి కూడా స్లిమ్ అయ్యారు.

ఈ భారీ ప్రాజెక్టుకు ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించబోతున్నాడు. నయనతార హీరోయిన్ గా, ప్రగ్యా జైశ్వాల్ సెకెండ్ హీరోయిన్ గా నటించనుంది. బిగ్ బి అమితాబ్, తమిళ నటుడు విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

NEWS UPDATES

CINEMA UPDATES