గ్రాండ్ గా ప్రారంభమైన సైరా షూటింగ్

172

మెగాభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఏ రోజుకోసమైతే వాళ్లు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూశారో ఆరోజు రానే వచ్చింది. ఈరోజు సైరా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో ఉదయం 7గంటల 30 నిమిషాలకు సైరా రెగ్యులర్ షూట్ బిగిన్ అయింది. ఇవాళ్టి నుంచి 10 రోజుల పాటు ఈ షెడ్యూల్ కొనసాగుతోంది.

సైరా రెగ్యులర్ షూటింగ్ మొదలైనట్టు కొణెదల ప్రొడక్షన్స్ బ్యానర్ అఫీషియల్ గా ప్రకటించింది. ఈ మేరకు ఓ చిన్న వీడియోను కూడా పోస్ట్ చేసింది. మరోవైపు సైరా సెట్స్ లో ఎక్కడ చూసినా ఉత్కంఠ, ఆనందం కనిపించింది. మొదటి రోజు షూట్ కావడంతో చిన్న టెన్షన్ తో కూడిన ఆనందాన్ని అనుభవించింది యూనిట్.

ఈ సినిమా కోసం చిరంజీవి ప్రత్యేకంగా ముస్తాబైన విషయం తెలిసిందే. గడ్డం పెంచడమే కాకుండా, కాస్త బరువు కూడా తగ్గాడు. హీరోయిన్ నయనతార మాత్రం ఇంకా సెట్స్ పైకి రాలేదు. త్వరలోనే షూటింగ్ షెడ్యూల్స్ కు సంబంధించి అధికారిక ప్రకటన చేయబోతున్నాడు చరణ్. దాదాపు 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రాబోతోంది సైరా సినిమా.

NEWS UPDATES

CINEMA UPDATES