మరో రీమేక్ సినిమాలో మిల్కీబ్యూటీ

165

ప్రస్తుతం క్వీన్ సినిమా రీమేక్ లో నటిస్తున్న తమన్న, మరో రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాకపోతే ఈసారి సౌత్ లో కాదు. బాలీవుడ్ లో. తమిళ్ లో హిట్ అయిన జిగర్ తాండా సినిమా హిందీ రీమేక్ లో తమన్న హీరోయిన్ గా నటించనుంది.

జిగర్తాండా సినిమా తమిళ్ లో హిట్ అయింది. ఈ యాక్షన్ కామెడీ డ్రామాలో సిద్దార్థ్ హీరో. హిందీ రీమేక్ లో సిద్దార్థ్ పోషించిన పాత్రను ఫర్హాన్ అక్తర్ పోషించబోతున్నాడు. లక్ష్మీమీనన్ క్యారెక్టర్ ను తమన్న చేయబోతోంది. సినిమాలో అత్యంత కీలకమైన విలన్ పాత్రలో సంజయ్ దత్ కనిపించబోతున్నాడు. తమిళ వెర్షన్ లో ఈ పాత్రకు బాబీ సింహా ప్రాణం పోశాడు.

అయితే ఈ రీమేక్ తమన్న బాలీవుడ్ కెరీర్ కు ఏమేరకు ఉపయోగపడుతుందనేది పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు ఎలాంటి ప్రాధాన్యం లేదు. పైగా డీ-గ్లామరైజ్డ్ రోల్. ఇలాంటి సినిమాతో మరోసారి బాలీవుడ్ లో లక్ చెక్ చేసుకోబోతోంది మన మిల్కీబ్యూటీ.

NEWS UPDATES

CINEMA UPDATES