వర్మ హీరోయిన్ పై సస్పెన్స్ వీడింది

352

వర్మ అంటే రామ్ గోపాల్ వర్మ కాదు.. తెలుగులో సూపర్ హిట్ అయిన అర్జున్ రెడ్డి రీమేక్ కు తమిళ్ లో వర్మ అనే టైటిల్ పెట్టారు. ఆ సినిమా హీరోయిన్ పై తాజాగా సస్పెన్స్ వీడింది. మొన్నటివరకు ఈ సినిమాలో హీరోయిన్ గా నటించే అమ్మాయిపై చాలా పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ ఎవర్నీ సెలక్ట్ చేయలేదు మేకర్స్. ఓ కొత్తమ్మాయి కోసం కాస్టింగ్ కాల్ కు పిలుపునిచ్చారు.

అవును.. అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ లో కొత్త హీరోయిన్ ను తీసుకోబోతున్నారు. ఈ సినిమాతో విక్రమ్ కొడుకు ధృవ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. కొత్త హీరో కాబట్టి, హీరోయిన్ ను కూడా కొత్త ముఖం అయితే బాగుటుందని విక్రమ్ భావించాడు. స్వయంగా తనే కాస్టింగ్ కాల్ కు పిలుపునిచ్చాడు.

ఓ అందమైన అమ్మాయితో వీడియో షూట్ చేసి పోస్ట్ చేశాడు విక్రమ్. ఇలాంటి క్వాలిటీస్ మీలో ఉంటే ఫొటోలు పంపించండంటూ మెయిల్ ఐడీ ఇచ్చాడు. త్వరలోనే వర్మ గర్ల్ ఫ్రెండ్ ఎవరో తెలిసిపోతుంది. బాల ఈ రీమేక్ కు దర్శకుడు.

NEWS UPDATES

CINEMA UPDATES