పెళ్లి కానుక‌గా 5 లీట‌ర్ల పెట్రోల్

790

త‌మిళ‌నాడులో జ‌రిగిన ఓ పెళ్లి వేడుక‌ల్లో వింత సంఘ‌ట‌న జ‌రిగింది. పెళ్లికొడుకు స్నేహితులు వినూత్నంగా ఆలోచించి…పెళ్లి కానుక‌గా 5 లీట‌ర్ల పెట్రోల్‌ను బ‌హూక‌రించారు. అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేశారు.

కొత్త దంప‌తుల‌ను ఆశీర్వ‌దించే క్ర‌మంలో బంధువులు, స్నేహితులు ఒక్కొక్క‌రుగా వారిని స‌మీపిస్తున్నారు. ఆ క్ర‌మంలో పెళ్లికొడుకు స్నేహితులు కొంద‌రు అక్క‌డ‌కు చేరుకుని 5 లీట‌ర్ల పెట్రోల్ క్యాన్‌ను మ్యారేజ్ గిఫ్ట్‌గా అందించారు. దీంతో అక్క‌డ ఉన్న‌వారంతా కేరింత‌లు కొట్టారు. ఈ సంఘ‌ట‌న‌ను రికార్డు చేసిన కొంద‌రు ఒక ఛానెల్‌కు పంప‌డం…ఆ ఛానెల్ ఈ వీడియోను టెలికాస్ట్ చేయ‌డంతో విష‌యం వెలుగు చూసింది.

దేశ వ్యాప్తంగా పెట్రోల్ ధ‌ర‌లు ఏ విధంగా పెరుగుతూ సామాన్యుడి న‌డ్డివిరుస్తున్నాయో తెలియ‌జేసేందుకు ఈ సంఘట‌న ఓ పెద్ద ఉదాహ‌ర‌ణ‌గా నిల‌వ‌నుంది.

త‌మిళ‌నాడులో ప్ర‌స్తుతం పెట్రోల్ ధ‌ర లీట‌ర్ రూ. 85.15లుగా ఉంది. హైద‌రాబాద్‌లో రూ.86.85 ఉంది. ఢిల్లీలో రూ. 81.91 ఉండ‌గా ముంబైలో రూ 89.29 ఉంది.

NEWS UPDATES

CINEMA UPDATES