నేను సీఐల‌కే పోస్టింగ్ వేయిస్తా…. నేను ఊద‌ను….

1138

గుంటూరు ప‌ట్నంబ‌జార్‌లో టీడీపీ నేత ఒక‌రు హ‌ల్ చ‌ల్ చేశారు. తాగి కారు న‌డిపి ఒక చిన్నారిని ఢీకొట్ట‌డ‌మే కాకుండా స్టేష‌న్‌లో బెదిరింపుల‌కు దిగాడు. త‌న‌ను వ‌దిలేయ‌క‌పోతే సంగ‌తి తేలుస్తా అంటూ పోలీసుల‌ను బెదిరించాడు. రాజేంద్రనగర్‌కు చెందిన మద్దన రామాంజనేయస్వామి సోమవారం రాత్రి 7గంటల సమయంలో మద్యం తాగి ఇంటికి వెళుతున్నాడు.

ఒక మ‌హిళా, ప్ర‌స‌న్న‌కుమార్ అనే బాలుడు దారి ప‌క్క‌న వెళ్తుండ‌గా మ‌ద్యం మ‌త్తులో వేగంగా కారు న‌డిపి బాలుడిని ఢీకొట్టాడు రామాంజ‌నేయ‌స్వామి. దీంతో బాలుడి కాలికి తీవ్ర గాయ‌మైంది. మ‌ద్యం మ‌త్తులోఉన్న రామాంజ‌నేయను స్థానికులు ప‌ట్టుకుని పోలీసుల‌కు అప్ప‌గించారు.

స్థానిక‌ పోలీస్‌ స్టేష‌న్‌కు ఆయ‌న్ను త‌ర‌లించ‌గా తాను టీడీపీ నేత‌నంటూ ర‌చ్చ మొద‌లుపెట్టారు. నేను తెలుగుదేశం పార్టీ వాడిని…. మంత్రి ఫోన్‌ చేసినా వదలరా…. మాతోనూ అవసరాలు వస్తాయి…. అప్పుడు మీ సంగతి చూస్తానంటూ బెదిరించాడు. సీఐ స్థాయిలో పోస్టింగ్‌లు వేయిస్తానని, ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఇబ్బందులు తప్పవంటూ హెచ్చరించాడు.

టీడీపీ నేత‌నైన త‌న‌తోనే బ్రీత్ ఎన్ లైజ‌ర్‌లో గాలి ఊదిస్తారా ఎంత ధైర్యం అంటూ ఓ రేంజ్‌లో లేచారు. ఫొటో తీయ‌బోయిన అసిస్టెంట్ రైట‌ర్‌ను దుర్భాషలాడాడు. అనంత‌రం ట్రాఫిక్‌ పోలీసులు వ‌చ్చి అత‌డిని తీసుకెళ్లారు. ఆ స‌మ‌యంలోనూ పోలీసుల‌పై తీవ్ర వ్యాఖ్య‌లు చేశాడు రామాంజ‌నేయస్వామి.

NEWS UPDATES

CINEMA UPDATES