ఏంజెలీనా పై అభిమానంతో.. యాభై సర్జరీలా ?

186

ఇది అభిమానమా.. లేక మరోటా అర్థం కావడం లేదు. ప్రేమ ఉంటే ఉండాలి కానీ.. మరీ ఇలా ప్రాణం మీదికి తెచ్చుకునేంతగానా అని అంతా ప్రశ్నిస్తున్నారు. ఇరాన్ కు చెందిన అమ్మాయి సహర్ టబర్ చేసిన ఈ పని చూస్తే.. ఎవరికైనా అయ్యో పాపం అనిపించక మానదు. తర్వాత ఆ అమ్మాయి చేసిన పనికి కోపం కూడా రాక మానదు.

సహర్ బటర్.. చాలా అందంగా ఉంటుంది. అయినా కూడా.. ఆమెకు హాలీవుడ్ స్టార్ ఏంజెలీనా జోలీ అంటే పిచ్చి. ఆమెలా మారిపోయేంతగా పిచ్చి. అందుకే.. ఒకటి కాదు.. రెండు కాదు.. యాభై ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుందట. ప్రతిసారీ.. తను ఏంజెలీనాలా మారిపోవడం ఖాయమంటూ ఎదురు చూసిందట.

కానీ.. ప్రతి సారీ ఏదో ఒక లోపం ఉండడం.. తర్వాత మళ్లీ సర్జీరీ చేసుకోవడంతో.. ఇదిగో.. ఇలా తయారైపోయింది. చిన్న వయసులోనే.. తొంభై ఏళ్ల బామ్మలా మారిపోయింది. అన్నీ బానే ఉన్నాయి. కానీ.. అసలు మొహమే ఇలా.. ఏంజెలీనా అవుదామని వెళ్తే.. ఇందే అయినట్టుగా రూపు సంతరించుకుంది.

అందుకే.. అంతా అంటున్నారు. అభిమానం అభిమానంగా ఉన్నంతవరకూ ఏం కాదు.. అది హద్దులు దాటితేనే.. ఇలాంటి ఇబ్బందులు వస్తాయి అని.

NEWS UPDATES

CINEMA UPDATES