టీనేజ్‌కే దంతాలు క‌దులుతాయా?

608

ప‌దిహేనేళ్ల‌కే చిగుళ్లు క‌దిలిపోతున్నాయి. మా త‌రంలో అర‌వై నిండినా కూడా ప‌ళ్లు గ‌ట్టిగా ఉండేవి. బ‌ఠాణీ గింజ ప‌టుక్కున కొరికే వాళ్లం. ఇప్పుడు పిల్ల‌లు ఏం తింటున్నారో కానీ ప‌ళ్లు గ‌ట్టిగా ఉండ‌డం లేదు, ఒళ్లు గ‌ట్టిగా ఉండ‌డం లేదు… ఇలాంటి మాట‌లు ఓ ఎన‌భై ఏళ్ల వ‌య‌సు పెద్ద వాళ్లున్న ఇళ్ల‌లో ఏదో ఒక సంద‌ర్భంలో వినిపిస్తుంటాయి. నిజ‌మే ఈ త‌రం పిల్ల‌ల‌కు, వాళ్ల త‌ల్లిదండ్రుల‌కు కూడా దంతాల గ‌ట్టిద‌నం త‌క్కువే. ప‌న్ను వీక్ అయిపోయింది, ఊడి వ‌చ్చేస్తుందో ఏమో అనే ఆందోళ‌న‌లు ఎక్కువ‌య్యాయి. నిజానికి అనారోగ్యం దంతాల‌కు కాదు వాటిని ప‌ట్టుకుని ఉండే చిగుళ్ల‌ది.

చిగుళ్ల స‌మ‌స్య ఎలాంటి సంకేతాన్ని ఇవ్వ‌కుండానే దంతాల మీద దాడి చేస్తుంది. చిగుళ్లు అనారోగ్యం పాల‌యినా కూడా ఎటువంటి సింప్ట‌మ్స్‌నీ ఇవ్వ‌వు. నొప్పి పెట్ట‌క‌పోవ‌డంతో మ‌నం చిన్న చిన్న లోపాల‌ను గుర్తించినా కూడా ప‌ట్టించుకోం. ఇలాంటి వారిలో 40 ఏళ్ల‌కే దంతాల మ‌ధ్య సందులు రావ‌డం, ప‌ళ్లు ఊడిపోవ‌డం జ‌రుగుతుంది. దంతం గ‌ట్టిగా ఉన్న‌ప్ప‌టికీ చిగురు అనారోగ్యం కార‌ణంగా దంతాన్ని ప‌ట్టు కోల్పోతుంది. ఆధారం లేక‌పోవ‌డంతో కూలిపోయిన స్తంభంగాలా ప‌న్ను ఊడి వ‌చ్చేస్తుంది.

ఇందుకు ప‌రిష్కారం క‌నీసం ఏడాదికోసారి డెంట‌ల్ చెక‌ప్ చేయించుకోవ‌డం, రోజూ రెండు ద‌ఫాలు బ్ర‌ష్ చేయ‌డం. వారానికి ఒక ద‌ఫా ఫ్లాసింగ్ (దారాన్ని దంతాల మ‌ధ్య‌కు దూర్చి లాగితే సందుల్లో ఉన్న పాచి దారానికి అంటుకుని వ‌చ్చేస్తుంది. బ్ర‌ష్ దూర‌ని చోట్ల కూడా దంతాలు పూర్తిగా శుభ్ర‌మ‌వుతాయి) చేయాలి.

ఏదైనా కార‌ణంగా ఒక‌టి రెండు దంతాలు ఊడిపోతే ఎలాగూ ఊడిపోయాయి క‌దా అని వ‌దిలేయ‌కూడ‌దు. వాటిని నిర్ల‌క్ష్యం చేయ‌కుండా మిగిలిన దంతాల కోసం ట్రీట్‌మెంట్ చేయించుకోవాలి. ఆ గ్యాప్‌ను ఫిల‌ప్ చేయ‌కుడా వ‌దిలేస్తే ప‌క్క‌న ఉండే దంతాలు ఫేప‌వుట్ (ప‌క్క‌కు వంగ‌డం) అవుతాయి. దాంతో ముఖం ఆక్రుతిలోనూ మార్పు వ‌స్తుంది.

జెల్‌, స్వీట్లు, సూదీస్ ఎక్కువ‌గా తిన‌డం వ‌ల్ల చిన్న పిల్ల‌ల్లో దంతాలు, చిగుళ్ల ప్రాబ్లెమ్స్ ఎక్కువ‌గా వ‌స్తున్నాయి. ప‌దేళ్ల‌కే ప‌న్ను పిప్పి కావ‌డం, చిగురు ఇన్‌ఫెక్ష‌న్‌ల‌తో వాచి ప‌న్ను క‌దిలిపోవ‌డం వంటివి ఎక్కువ‌య్యాయి.

దీనికి విరుగుడు గా రాత్రి ప‌డుకునే ముందు బ్ర‌ష్ చేయ‌మ‌ని చెప్తుంటారు డాక్ట‌ర్లు. అయితే బ్ర‌ష్ చేయ‌డంతోపాటు పేస్ట్‌లో ఉండే షుగ‌ర్స్ పూర్తిగా వ‌దిలే వ‌ర‌కు పుక్కిలించి ఉమ్మ‌డం కూడా చాలా అవ‌స‌రం. చిన్న పిల్ల‌ల‌కు త‌ల్లిదండ్రులు బ్ర‌ష్ చేతికి ఇచ్చే వ‌ర‌కే ఫాలో అప్ చేస్తుంటారు. ఆ త‌ర్వాత పిల్ల‌లు నోటిని శుభ్రంగా క‌డుక్కున్నారా లేదా అనేది పెద్ద‌గా ప‌ట్టించుకోరు. దాంతో స్వీట్ తిని అలాగే నిద్ర‌పోయిన పిల్ల‌ల‌కు, బ్ర‌ష్ చేసి స‌రిగ్గా క‌డుక్కోకుండా నిద్ర‌పోయిన పిల్ల‌ల‌కూ పెద్ద తేడా ఉండ‌క‌పోవ‌చ్చు.

NEWS UPDATES

CINEMA UPDATES