ముహూర్తం ఫిక్స్…. కొత్త ఏడాదితోనే స్టార్ట్!

817

తెలంగాణలో రైతులకు 24 గంటలపాటూ.. ఉచిత విద్యుత్ సరఫరా పథకానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ముహూర్తాన్ని ఖరారు చేశారు. ట్రయల్ రన్ లో విద్యుత్ కంపెనీలు సక్సెస్ అవడంతో.. ఇక ధైర్యంగా అడుగు ముందుకు వేయాలని నిర్ణయించుకున్నారు. ఈ దిశగా.. అసెంబ్లీ సమావేశాల సాక్షిగా.. కీలక నిర్ణయాన్ని ప్రకటించారు.. కేసీఆర్.

రైతులకు వచ్చే సీజన్ నుంచి పంటకు ఆర్థిక సహాయం చేసే పథకంపై అసెంబ్లీలో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్.. కాస్త సుదీర్ఘంగానే ప్రసంగించారు. తర్వాత.. వ్యవసాయానికి నిరంతర ఉచిత విద్యుత్తుపై మాట్లాడారు. రైతులు ఆటో స్టార్టర్లను పంపు సెట్ల నుంచి తొలగించాలని కోరారు.

ఇకపై.. అన్నదాతలకు ఇరవై నాలుగు గంటల పాటూ.. విద్యుత్ అందుబాటులోకి రాబోతోందని.. ఎప్పుడు కుదిరితే అప్పుడే.. రైతులు పొలానికి కరెంటు వాడుకోవచ్చని చెప్పారు. ఎన్ని వేల మెగావాట్ల విద్యుత్తునైనా సమకూర్చుకునేందుకు విద్యుత్తు సంస్థలు కూడా సిద్ధంగా ఉన్నాయని సభలో ప్రకటించారు.

విపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. వచ్చే ఏడాది ఆరంభం నుంచే.. అంటే 2018 జనవరి 1 నే.. నిరంతర విద్యుత్ సరఫరాను మొదలు పెడతామని ముఖ్యమంత్రి చెప్పడం.. అన్నదాతల్లో ఆనందాన్ని పెంచింది. అదే సమయంలో.. ముఖ్యమంత్రి ప్రకటనను.. విపక్ష సభ్యులు కూడా తప్పుబట్టలేకపోవడం గమనార్హం.

ఇలా.. పక్కా వ్యూహంతో.. పక్కా లెక్కలతో విపక్షాలను సభలో ఇరుకున పెడుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. రైతులకు నిరంతర విద్యుత్ పథకంతో మరోసారి తన మార్క్ రాజకీయాన్ని చూపించారనే చెప్పాలి.

NEWS UPDATES

CINEMA UPDATES