కొలిక్కిరాని చర్చలు… బంద్ తప్పదా…?

273

సినీరంగాన్ని ఇబ్బందిపెడుతున్న సర్వీస్ ప్రొవైడర్ల వ్యవహారం కొలిక్కి రాలేదు. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు తమ రేట్లు తగ్గించాల్సిందేనంటూ నిర్మాతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు చెన్నైలో సమావేశం జరిగింది. నిర్మాతలంతా కలిసి జాయింట్ యాక్షన్ ఫోర్స్ గా తయారయ్యారు. ఇలాంటి కమిటీతో చెన్నైలోని ఫిలింఛాంబర్ లో డీఎస్పీ సభ్యులు చర్చించారు.

కానీ ఆ చర్చలు దాదాపు విఫలమయ్యాయి. ఇటు నిర్మాతలు, అటు డీఎస్పీల మధ్య ఎలాంటి ఏకాభిప్రాయం కుదరకుండానే సమావేశాలు వాయిదాపడ్డాయి. మరోసారి 23వ తేదీన సమావేశమవ్వాలని ఇరుపక్షాలు నిర్ణయించాయి. ఈ సందర్భంగా నిర్మాతల సంఘం మరోసారి బంద్ పై క్లారిటీ ఇచ్చింది. 23న జరగబోయే సమావేశాల్లో కూడా ఏకాభిప్రాయానికి రాకపోతే బంద్ తప్పదని హెచ్చరించింది.

మార్చి 1 నుంచి ఏపీ, నైజాం, తమిళనాట బంద్ పాటించాలని ఇప్పటికే సినీపెద్దలు నిర్ణయించారు. క్యూబ్, పీఎక్స్ డీ, యూఎఫ్ఓ లాంటి సంస్థలు తమ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు

NEWS UPDATES

CINEMA UPDATES