రవితేజ కోసం తమన్ ని లైన్ లో పెట్టిన శ్రీను వైట్ల

225

శ్రీను వైట్ల ప్రస్తుతం రవితేజ తో కలిసి మూవీ చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. “అమర్ అక్బర్ అంటోనీ” అని టైటిల్ పెట్టుకున్న ఈ మూవీ లో రవితేజ మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడని అందరికి తెలిసిన విషయమే. ఇదిలా ఉంటె శ్రీనువైట్ల చేసిన సినిమాల్లో ఎక్కువశాతం దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో మంచి మ్యూజికల్ హిట్స్ కూడా ఉన్నాయి. కానీ ఆమధ్య దేవిశ్రీ ప్రసాద్ ని వదిలేసి తమన్ ని సంగీత దర్శకుడిగా తీసుకున్నాడు. తాజాగా రవితేజ సినిమాకోసం మళ్ళీ తమన్ నే సంగీత దర్శకుడిగా తీసుకున్నాడు శ్రీనువైట్ల.

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో తమన్ సంగీతం అందించిన సినిమాలన్నీ వరుసగా విజయం సాధిస్తున్నాయి. ఈ నేపధ్యంలో శ్రీను వైట్ల కూడా మళ్లీ తమన్ నే రిపీట్ చేయాలని భావించాడట. సో శ్రీను వైట్ల ఇంకా రవితేజ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ ఫిక్స్ అయ్యాడు. త్వరలో హీరోయిన్ కూడా ఫైనల్ అవుతుంది. మైత్రి మూవీ మేకర్స్ వారు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీ షూటింగ్ మొత్తం అమెరికా లో జరుగుతుంది అంట.

NEWS UPDATES

CINEMA UPDATES