సంక్రాతి రేస్ నుంచి వెనక్కి తగ్గిన రవితేజ

161

“రాజా ది గ్రేట్” మూవీ తో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన రవితేజ ప్రస్తుతం తన తదుపరి మూవీ అయిన “టచ్ చేసి చూడు” మూవీ షూటింగ్ తో బిజీ గా ఉన్నాడు. రవితేజ సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ లో సీరత్ కపూర్ ఒక ముఖ్య పాత్రని పోషిస్తుంది. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ మూవీ ని వచ్చే ఏడాది సంక్రాతి కానుకగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేసారు నిర్మాతలు. అయితే లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ మూవీ షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉండడంతో ఈ మూవీ ని పోస్ట్ పోన్ చేయాలనీ ప్లాన్ చేసారట మూవీ యూనిట్. అసలు కారణం షూట్ బ్యాలెన్స్ కాదట…. మూవీలో కొన్ని సీన్స్ రీ-షూట్ జరగడం వల్లే మూవీ లేట్ అవుతుందని అంటున్నాయి సినివర్గాలు.

నల్లమలుపు బుజ్జి, వల్లభనేని వంశీలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ లో రవితేజ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. రాశి ఈ సినిమాలో వెస్ట్రన్ డ్యాన్స్ టీచర్‌ పాత్రలో కనిపించనుంది. విక్రం సిరికొండ ఈ మూవీ ని ఎంతో స్టైలిష్ గా తెరకేక్కిస్తున్నాడు అనే టాక్ ఫిలిం నగర్ లో ఉంది. ప్రీతమ్ సంగీతాన్ని సమకూరుస్తున్న ఈ మూవీ రవితేజ కెరీర్ లో మంచి విజయం సాధిస్తుందని డైరెక్టర్ నమ్మకం తో ఉన్నాడు.

NEWS UPDATES

CINEMA UPDATES