ఆ 30 సీట్ల‌పైనే టీఆర్ఎస్ ఆశ‌లు !

1202

తెలంగాణ రాష్ట్ర స‌మితి ఎన్నిక‌ల ప్ర‌చారంలో వ్యూహాత్మ‌కంగా ముందుకెళుతోంది. ఇప్ప‌టికే 105 మంది అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించింది. వారిలో కొంద‌రి అభ్య‌ర్థుల‌పై అస‌మ్మ‌తి స్వ‌రం వినిపిస్తోంది. వాటిని సెట్ చేసే ప‌నిలో గులాబీ పెద్ద‌లు బీజీగా ఉన్నారు.

మ‌రోవైపు ప్ర‌తిప‌క్షాల రాజ‌కీయ ఎత్తుల‌ను ప‌రిశీల‌నగా చూస్తున్నారు. అటు త‌మ పార్టీనేతల అసమ్మ‌తిని…. ఇటు కొంద‌రు సిట్టింగ్‌ల‌పై ఉన్న వ్య‌తిరేక‌త‌ను లెక్క‌లోకి తీసుకుంటే కొన్ని సీట్లు త‌ము కోల్పోయే అవ‌కాశాలు ఉన్నాయ‌నేది గులాబీ పెద్దల అంచ‌నా. ఈ సీట్ల‌ను ఎక్క‌డ భ‌ర్తీ చేసుకోవాలో గులాబీ పెద్ద‌లు ఆలోచిస్తున్నారు.

అయితే ప్ర‌తిపక్షాల కూట‌మి ఏర్ప‌డబోతోంది. మ‌హాకూట‌మి ఒక‌సారి తెర‌పైకి వ‌చ్చిన త‌ర్వాత ప‌రిస్థితులు ఎలా ఉంటాయి అనే విషయంపై లెక్క‌లు వేస్తోంది. కాంగ్రెస్ అభ్య‌ర్థులు ఈ సారి త‌మ‌కు స‌వాల్ విసురుతున్నార‌న్న సంగ‌తిని గ‌మ‌నించింది. అయితే ఇక్క‌డే మ‌హాకూట‌మి త‌మ‌ని ఎలా దెబ్బ‌తీస్తుందా? అనే అంచ‌నాల‌పై కూడా ఓక్లారిటీకి వచ్చింది.

మ‌హాకూట‌మిలో సీట్ల పంప‌కం త‌మ‌కు క‌లిసివ‌స్తుంద‌ని కొంద‌రు గులాబీ నేత‌లు చెబుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ జ‌న‌స‌మితి, సీపీఐకి ఇచ్చే సీట్ల‌లో కాంగ్రెస్ నేత‌లు అసంతృప్తికి గుర‌య్యే అవ‌కాశాలు ఉన్నాయ‌నేది వారి అంచ‌నా. ఈ సీట్ల‌లో ఉన్న కాంగ్రెస్ నేత‌ల‌ను త‌మ వైపు తిప్పుకుంటే విజ‌యం ఖాయ‌మ‌ని భావిస్తోంది.

పొత్తులో భాగంగా 30 సీట్లు మిత్ర‌ప‌క్షాల‌కు ఇస్తే… ఇక్క‌డ త‌మ గెలుపు సునాయాసం అని టీఆర్ఎస్ నేత‌లు అనుకుంటున్నారు. మొత్తానికి మ‌హాకూట‌మి త‌మ‌ను గెలుపు తీరానికి చేరుస్తుంద‌ని గులాబీ నేత‌లు ఆశ‌లు పెట్టుకుంటున్నారు.

NEWS UPDATES

CINEMA UPDATES