కేసీఆర్‌ ని నిజంగానే ఆ ఎమ్మెల్యే బెదిరించారా?

693

తెలంగాణ‌లో రాజ‌కీయ వ‌ల‌స‌లు ఊపందుకున్నాయి. పార్టీల మ‌ధ్య జంపింగ్‌లు పెరిగాయి. నెల రోజుల కింద‌ట టీడీపీ నుంచి భారీగా కాంగ్రెస్‌లోకి నేత‌లు చేరారు. టీడీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డితో పాటు డ‌జ‌న్‌కి పైగా నేత‌లు కాంగ్రెస్‌లో చేరారు. అయితే వీరిలో కొంద‌రు అధికార పార్టీ టీఆర్ఎస్‌లో క‌ర్చీప్‌లు వేయాల‌ని ప్లాన్ వేశారు. పెద్ద‌ప‌ల్లి మాజీ ఎమ్మెల్యే చింత‌కుంట విజ‌య‌ర‌మ‌ణారావు టీఆర్ఎస్‌లో చేరేందుకు ఆ పార్టీ ముఖ్య నేత‌ల‌తో ముందుగా మంత‌నాలు జ‌రిపార‌ట‌. అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ విష‌యంపై గులాబీ బాస్ క్లారిటీ ఇవ్వ‌లేదు. పార్టీలోకి వ‌స్తే ఎమ్మెల్సీ గానీ…నామినేటేడ్ ప‌ద‌వి ఇస్తామ‌ని ఆశ చూపార‌ని తెలిసింది.

ఎమ్మెల్యే మ‌నోహ‌ర్ రెడ్డి

అయితే పెద్ద‌ప‌ల్లిలో ప్ర‌స్తుతం టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మ‌నోహ‌ర్ రెడ్డి ఉన్నారు. ఆయ‌న్ని కాద‌ని ఈయ‌న‌కు టికెట్ ఇచ్చే ప‌రిస్థితి లేద‌ని గులాబీ నేత‌లు చెప్పార‌ట‌. అయితే బ్యాక్‌గ్రౌండ్‌లో విజ‌య‌ర‌మ‌ణారావు పార్టీలోకి రాకుండా మ‌నోహ‌ర్‌రెడ్డి మంచి ఎత్తులే వేశార‌ని టీఆర్ఎస్ నేత‌లు చెబుతున్నారు. గులాబీ బాస్ కేసీఆర్‌ని ఒక‌ర‌కంగా బెదిరించార‌ని అంటున్నారు.

టీడీపీ నేత‌లను పార్టీలోకి తీసుకుంటే తాను కాంగ్రెస్‌లోకి వెళ‌తాన‌ని అల్టిమేట‌మ్ ఇచ్చార‌ట‌. సిట్టింగ్ ఎమ్మెల్యే పార్టీ మారితే టీఆర్ఎస్‌కు త‌ల‌నొప్పులు వస్తాయ‌ని గులాబీ నేత‌లు భావించార‌ట‌. అందుకోస‌మే విజ‌య‌ర‌మ‌ణారావును పార్టీలోకి ఆహ్వానించ‌లేద‌ట‌. మరోవైపు రెడ్డి ఎమ్మెల్యేను వ‌దులుకుంటే పూర్తిగా వ్య‌తిరేక‌త వ‌స్తుందని భావించిన అధికార పార్టీ నేత‌లు టీడీపీ నేత‌ను పార్టీలోకి తీసుకోలేద‌ని తెలుస్తోంది.

ఇటు పెద్ద‌ప‌ల్లిలో ఇప్పుడు ద్వితీయ శ్రేణి నాయ‌కులకు టీఆర్ఎస్,కాంగ్రెస్‌లు వ‌ల వేస్తున్నాయి. పోటాపోటీగా చేరిక‌ల కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నాయి. ముఖ్యంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్‌,కాంగ్రెస్‌, బీజేపీల మ‌ధ్య ఇక్క‌డ త్రిముఖ పోటీ నెల‌కొనే అవ‌కాశం ఉంది. టీఆర్ఎస్ నుంచి మ‌నోహ‌ర్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి విజ‌య‌ర‌మ‌ణారావు, బీజేపీ నుంచి గుజ్జుల రామ‌కృష్ణారెడ్డి బ‌రిలో ఉండ‌బోతున్నారు. ఇప్ప‌టికే ముగ్గురు నేత‌లు నియోజ‌క‌వ‌ర్గంపై ప‌ట్టుకోసం విస్తృత ప‌ర్య‌టన‌లు చేస్తున్నారు.

NEWS UPDATES

CINEMA UPDATES