వ‌చ్చే ఎన్నిక‌ల కోసం గులాబీ సేన‌…. రిక్రూట్‌మెంట్‌…. శిక్షణ

252

ఎన్నిక‌ల‌కు ఏడాది టైమ్ ఉంది. కానీ అప్పుడే గులాబీ బాస్ ప్రిప‌రేష‌న్లు మొదలెట్టారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో స‌త్తా చాటేందుకు సొంత సైన్యం ఏర్పాటును మొద‌లెట్టారు. ప్ర‌తి ప‌ల్లెలో క్రియాశీల‌క కార్య‌క‌ర్త‌ల‌ను త‌యారు చేయ‌డం ద్వారా ఎల‌క్ష‌న్ మేనేజ్‌మెంట్‌ను ప‌క‌డ్బందీగా అమ‌లు చేసేలా కార్యాచ‌ర‌ణ మొద‌లెట్టారు. ఈ క్ర‌మంలో ప్ర‌తి గ్రామ పంచాయ‌తీలో 50 మంది చురుకైన కార్య‌క‌ర్త‌ల‌ను గుర్తించి వారికి శిక్ష‌ణ ఇస్తోంది. ప్ర‌స్తుతం రంగారెడ్డి జిల్లా ఇబ్ర‌హీంప‌ట్నం నియోజ‌క‌వ‌ర్గంలో అమ‌లు చేస్తున్న ఈ ఫార్ములాను త్వ‌ర‌లోనే రాష్ట్ర వ్యాప్తంగా అమ‌లు చేసే అంశాన్ని గులాబీ బాస్ ప‌రిశీలిస్తున్నారు.

ఇబ్ర‌హీంప‌ట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిష‌న్‌రెడ్డి ఈ ఫార్ములాను అమ‌లు చేస్తున్నారు. ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్ల‌డంతో పాటు…పార్టీ సంస్థాగ‌తంగా బ‌లంగా త‌యారుకావాలంటే స‌మ‌ర్దులైన కార్య‌క‌ర్త‌ల అవ‌స‌రాన్ని పార్టీ గుర్తించింది. ఈ నేప‌థ్యంలో ప్ర‌తి గ్రామంలో చురుకైన 50 మంది కార్య‌క‌ర్త‌ల‌ను సెలెక్ట్ చేశారు. వీరిలో 25 మంది యువ‌కులు, ప‌ది మంది మ‌హిళ‌లు, మ‌రో 15 మంది సీనియ‌ర్లు ఉండేలా చూస్తున్నారు. ఇలా ఇబ్ర‌హీంప‌ట్నం నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని 79 గ్రామ పంచాయ‌తీ ప‌రిధిలో ఎంపిక చేసిన కార్య‌క‌ర్త‌ల‌కు ప్రత్యేక శిక్ష‌ణ ఇస్తున్నారు. పార్టీ వాణిని ఎలా వినిపించాలి? ప‌్ర‌జ‌ల‌తో ఎలా సంబంధాలు కొన‌సాగించాలి? అనే అంశంపై వీరికి ట్రైనింగ్ ఇస్తున్నారు.

మ‌రోవైపు వ‌చ్చే గ్రామ‌పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో వీరి నుంచే పార్టీ అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తార‌ని తెలుస్తోంది. 2014లో టీడీపీలో ఉన్న మంచిరెడ్డి కిష‌న్‌రెడ్డి…ఇదే ఫార్ములాను ప‌క‌డ్బందీగా అమ‌లు చేసి గెలిచారు. దీంతో ఇప్పుడు టీఆర్ఎస్‌లో ఇదే స్కెచ్ అమ‌లు చేస్తున్నారు. ఈ విష‌యం తెలిసిన గులాబీ బాస్ ఈ ఫార్ములాను అధ్య‌య‌నం చేయాల‌ని పార్టీ సీనియ‌ర్ నేత‌ల‌ను ఆదేశించారు. ఈ స్ట‌డీ ముగిసిన త‌ర్వాత రాష్ట్ర‌మంత‌టా ఇదే ఫార్ములాను అమ‌లు చేయాల‌ని గులాబీ నేత‌లు ఆలోచిస్తున్నారు.

NEWS UPDATES

CINEMA UPDATES