టీఆర్‌ఎస్‌ లోకి ఉమా మాధవరెడ్డి…. ఈ నెల 14న

475

తెలంగాణ తెలుగుదేశం నేత‌లకు భ‌విష్య‌త్‌పై బెంగ ప్రారంభ‌మైంది. ఇత‌ర పార్టీల్లో బెర్త్‌లు దొరికిన వారు జంప్ అవుతున్నారు. మిగ‌తావారు అవకాశాల్లేక ఎదురుచూపులు చూస్తున్నారు. ఎమ్మెల్యే సీటు దొర‌క‌పోతే వేరే ఏ ప‌ద‌వి దొర‌క‌క‌పోతుందా? అని కొంద‌రు క‌ర్చీప్‌లు వేస్తున్నారు. ఉత్త‌ర తెలంగాణలో టీడీపీ ఖాళీయైంది. ఇక ద‌క్షిణ తెలంగాణ‌లో జిల్లాకో లీడ‌ర్ మిగిలారు. వారు కూడా ఇప్పుడు ప‌క్క‌చూపులు చూస్తున్నారు. భువ‌న‌గిరి మాజీ ఎమ్మెల్యే ఉమా మాధ‌వ‌రెడ్డి టీఆర్ఎస్‌లో చేర‌బోతున్నారు. ఈమేర‌కు మంగ‌ళ‌వారం సీఎం కేసీఆర్‌ని ఆమె క‌లిశారు. త‌న కొడుకు సందీప్‌రెడ్డితో పాటు వెళ్లి ఆమె ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో కేసీఆర్‌ను క‌లిశారు. ఈనెల 14న మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు ఉమామాధ‌వ‌రెడ్డి గులాబీ కండువా క‌ప్పుకోబోతున్నారు.

అయితే రేవంత్‌తో పాటు కాంగ్రెస్‌లోకి వెళ్లాల‌ని ఉమా మాధ‌వ‌రెడ్డి ప్ర‌య‌త్నాలు చేసింది. అయితే ఇక్క‌డ ఉత్త‌మ్ వ‌ర్గానికి చెందిన ఓ బ‌డా రియ‌ల్ట‌ర్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని ప్లాన్‌లు వేస్తున్నారు. దీంతో ఉత్త‌మ్ ఉమా మాధ‌వ‌రెడ్డికి టికెట్‌పై భ‌రోసా ఇవ్వ‌లేదు. దీంతో ఆమె కాంగ్రెస్‌లో చేర‌లేదు. ఇటు ఈ మ‌ధ్య‌నే న‌క్స‌ల్స్ చేతిలో చ‌నిపోయిన నాయ‌కుల కుటుంబాల‌కు ఇచ్చే ఇళ్ళ‌ప‌ట్టాల వ్య‌వ‌హారం మీద ముఖ్య‌మంత్రి కెసిఆర్‌ని ఆమె అసెంబ్లీలో క‌లిశారు. అప్పుడే చ‌ర్చ‌లు జ‌రిగాయి. అయితే భువ‌న‌గిరిలో టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే పైళ్ల శేఖ‌ర్‌రెడ్డి ఉన్నారు. టికెట్‌పై హామీ ఇవ్వ‌డంతోనే ఆమె పార్టీ మారేందుకు సై అన్న‌ట్లు తెలుస్తోంది.

NEWS UPDATES

CINEMA UPDATES