ఈ వీకెండ్ కూడా అరడజను సినిమాలు

145

తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో ఇదొక విచిత్ర పరిస్థితి. వారానికి మినిమం 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కానీ థియేటర్లు మాత్రం ఖాళీ. ఏ ఒక్క సినిమా ఆకట్టుకునేలా లేకపోవడంతో.. థియేటర్లన్నీ బోసిపోతున్నాయి. ఇంకా చెప్పాలంటే 144 సెక్షన్ పెట్టినట్టు తయారయ్యాయి సినిమా హాళ్లు. మార్కెట్లో మూవీస్ చాలానే ఉన్నాయి. కలెక్షన్లు మాత్రం లేవు. ఇప్పుడీ గుంపులోకి చేరేందుకు మరో అరడజను సినిమాలు రెడీ అయ్యాయి.

అవును.. ఈ వీకెండ్ ఏకంగా 6 సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. థియేటర్ల సమస్య లేదు. ఎన్ని కావాలంటే అన్ని దొరుకుతాయి. ఎటొచ్చి ఈ 6 సినిమాల్లో ఎన్ని క్లిక్ అవుతాయో చూడాలి. వీటిలో సప్తగిరి ఎల్ ఎల్ బి, మళ్లీ రావా అనే మూవీస్ మాత్రమే కాస్తోకూస్తో జనాలకు తెలిసినవి. మిగతా సినిమా సినిమాలన్నీ గుంపులో గోవిందయ్య టైపే. ఈ వీకెండ్ థియేటర్లలోకి వస్తున్న సినిమాల లిస్ట్… వాటి వివరాలు..

సప్తగిరి ఎల్ ఎల్ బి – (డిసెంబర్ 7)

నటీనటులు – సప్తగిరి, కశిష్ వోరా, సాయికుమార్, పోసాని తదితరులు

దర్శకుడు – చరణ్ లక్కాకుల

సంగీత దర్శకుడు – విజయ్ బుల్గానిక్

బ్యానర్ – సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్

నిర్మాత – డా.రవికిరణ్

మళ్లీ రావా – (డిసెంబర్ 8)

నటీనటులు – సుమంత్, ఆకాంక్ష, అన్నపూర్ణ, కాదంబరి కిరణ్,

దర్శకుడు – గౌతమ్ తిన్ననూరి

సంగీత దర్శకుడు – శ్రవణ్ భరధ్వాజ్

బ్యానర్ – స్వధర్మ ఎంటర్ టైన్ మెంట్స్

నిర్మాత – రాహుల్ యాదవ్ నక్క

ప్రేమిక – (డిసెంబర్ 8)

నటీనటులు – తనీష్, శృతి, కవిత, రవివర్మ, దేవా

దర్శకుడు – మహేంద్ర

సంగీత దర్శకుడు – దిలీప్ బండారి

బ్యానర్ – దేశాల ఆర్ట్ మూవీస్

నిర్మాత – దేశాల లక్ష్మయ్య

బీటెక్ బాబులు – (డిసెంబర్ 8)

నటీనటులు – నందు, శౌర్య, శ్రీముఖి, రోషిణి, అలీ, షకలక శంకర్

దర్శకుడు – శ్రీను ఈమంది

బ్యానర్ – జేపీ క్రియేషన్స్

నిర్మాత – ధన జమ్ము

వానవిల్లు – (డిసెంబర్ 8)

నటీనటులు – లంక ప్రతీక్ ప్రేమ్ కరణ్, శ్రావ్య, విశాఖ,  కాశినాథ్, అనిత చౌదరి,  హేమ, ప్రవీణ్

దర్శకుడు – లంక ప్రతీక్ ప్రేమ్ కరణ్

సంగీత దర్శకుడు – సాయికార్తీక్

బ్యానర్ – ఆర్పీ మూవీ మేకర్స్

నిర్మాత – లంక కరుణాకర్ దాస్

 

ఆకలి పోరాటం – (డిసెంబర్ 8)

నటీనటులు – ప్రసాద్ బాబు, జెన్నీ, గీతా షా

దర్శకుడు – ఆనంద్ సాగర్

సంగీత దర్శకుడు – కానూరి రమణ

బ్యానర్ – రామ్ సాయి గోకులం క్రియేషన్స్

నిర్మాత – పి.రాఘవులు

NEWS UPDATES

CINEMA UPDATES