ప్రభాస్, నితిన్ పెళ్లి చేసుకున్నాకే నేను పెళ్లి చేసుకుంటా – వరుణ్ తేజ్

516

మెగా హీరో అయిన వరుణ్ తేజ్ రీసెంట్ గా “తొలిప్రేమ” అనే మూవీ తో క్లాస్ సక్సెస్ ని అందుకున్నాడు. అయితే ఈ మూవీ రిలీజ్ తరువాత వరుణ్ తేజ్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ పెళ్లి ఇప్పుడప్పుడే చేసుకోను అని చెప్పుకొచ్చాడు. తన కంటే ముందు చాలా మంది హీరోలు పెళ్లి కి రెడీ గా ఉన్నారు అని వారు చేసుకున్నాకే నేను పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు వరుణ్ తేజ్.

అలాగే ప్రభాస్, నితిన్ కే పెళ్లి పై తొందర లేదు. అప్పుడే నాకు ఎందుకు తొందర. హాయిగా కొన్నేళ్ళు మూవీస్ చేసుకుంటాను. ఆ తరువాత కూడా ప్రభాస్, నితిన్ పెళ్లి చేసుకుంటేనే నేను కూడా పెళ్లి చేసుకుంటాను అని చెప్పుకొచ్చాడు వరుణ్ తేజ్.

మొత్తానికి తన పెళ్లిని ప్రభాస్ పెళ్లి తో ముదిపెట్టాడు ఈ మెగా హీరో. ఇదిలా ఉంటే వరుణ్ తేజ్ తన తదుపరి మూవీ ని “ఘాజి” ఫేం అయిన సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ మూవీ పూర్తి స్థాయి స్పేస్ ఫిలిం గా తెరకెక్కనుంది.

NEWS UPDATES

CINEMA UPDATES