వరుణ్ తేజ్ స్పేస్ మూవీ బడ్జెట్ 40 కోట్లు ?

285

మెగా హీరో అయిన వరుణ్ తేజ్ ప్రస్తుతం “ఘాజీ” ఫేం అయిన సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఒక స్పేస్ థ్రిల్లర్ చేస్తున్నాడు. ఈ మూవీ కోసం వరుణ్ తేజ్ జీరో గ్రావిటీ లో ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఈ మూవీ కి దాదాపు 40 కోట్లకి పైగా బడ్జెట్ అవుతుందట. ప్రొడ్యూసర్స్ ఆల్రెడీ అంత బడ్జెట్ పెట్టడానికి కూడా ఒప్పుకున్నారు అని టాక్.

ఇదిలా ఉంటే వరుణ్ తేజ్ హీరో గా నటించిన “ఫిదా” మూవీ 50 కోట్లకి పైగా వసూల్ చేసింది. కానీ అది కేవలం వరుణ్ తేజ్ వల్ల మాత్రమే కాదు దిల్ రాజు, శేఖర్ కమ్ముల, సాయి పల్లవి వల్ల వచ్చాయి. అలాగే వరుణ్ తేజ్ లేటెస్ట్ మూవీ అయిన “తొలిప్రేమ” కేవలం 20 నుంచి 25 కోట్ల మధ్యలోనే ఆగిపోయేలా ఉంది. మరి ఈ నేపధ్యంలో వరుణ్ తేజ్ మీద ఇంత బడ్జెట్ పెట్టడం అవసరమా అని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. మొత్తానికి వరుణ్ తేజ్ మీద 40 కోట్లు పెట్టి రిస్క్ చేస్తున్న ఆ ప్రొడ్యూసర్స్ పేర్లు ఇంకా బయటకి రాలేదు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో ఉన్న ఈ మూవీ ని త్వరలో గ్రాండ్ గా లాంచ్ చేస్తారట.

NEWS UPDATES

CINEMA UPDATES