మరోసారి వెంకీ తో జత కట్టబోతున్న అనుష్క

168

“బాహుబలి” తరువాత అనుష్క నటిస్తున్న మూవీ “భాగమతి”. జి.అశోక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని జనవరి 26న విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత అనుష్క లేటెస్ట్ గా వెంకటేష్ సరసన నటించేందుకు ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. వెంకటేష్ హీరోగా తేజ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఇటీవలే పూజ కార్యక్రమాలు హైదరాబాద్ లో ఘనంగా ప్రారంభం అయ్యింది.

“ఆటా నాదే….వేటా నాదే” అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ మూవీ లో హీరోయిన్ ఎవరనే విషయంపై ఇంకా చర్చలు జరుగుతున్నాయి. మొదట కాజల్ అగర్వాల్ పేరు వినిపించిన గాని, కాజల్ వేరే సినిమాలతో బిజీగా ఉండడంతో అనుష్క పేరు ప్రస్తుతం లైన్ లోకి వచ్చింది. ఇప్పటికే తేజ, సురేష్ బాబు ఇంకా వెంకటేష్ హెల్ప్ తోని అనుష్కతో చర్చలు జరుపుతున్నాడట. ఇదిలా ఉంటే వెంకటేష్ తో “చింతకాయల రవి” “నాగవల్లి” సినిమాల్లో నటించిన అనుష్క మళ్ళి వెంకటేష్ తో కలిసి నటించడానికి రెడీ అవుతుంది. ఒకవేళ అన్ని అనుకున్నట్టు జరిగితే ఈ మూవీ లో వెంకీ సరసన మనం అనుష్క ని హీరోయిన్ గా చూడొచ్చు అనమాట. ఈ మూవీలో విక్టరీ వెంకటేష్ ప్రొఫెసర్ రోల్ లో కనిపించనున్నాడు అని టాక్.

NEWS UPDATES

CINEMA UPDATES