విక్రం కె కుమార్ దర్శకత్వం లో నాగ చైతన్య

151

అక్కినేని నాగార్జున తన కొడుకుల కెరీర్ పట్ల ఎంత జాగ్రత్త వహిస్తాడు అనేది అందరికి తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు అదే విధంగా అక్కినేని నాగ చైతన్య చేయబోయే ఒక ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసాడు నాగార్జున. లేటెస్ట్ గా నాగార్జున “హలో” సినిమా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ విక్రమ్ కుమార్ నాగ చైతన్య ను డైరెక్ట్ చెయ్యబోతున్నాడని చెప్పాడు. కానీ ప్రస్తుతం “హలో” సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న విక్రం కె కుమార్ ఈ సినిమా విడుదల తరువాత వేరే హీరోతో సినిమాను చెయ్యబోతున్నాడట. ఆ ప్రాజెక్ట్ తరువాత చైతు మూవీ ఉంటుందని నాగార్జున తెలిపారు.

దర్శకుడు విక్రమ్ కె కుమార్ రూపొందించే సినిమాలు రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా, కొత్తగా ఉంటాయి. “ఇష్క్” “24” “మనం” సినిమాలు దేనికదే డిఫరెంట్ గా ఉంటాయి. అయితే విక్రం కె కుమార్ లేటెస్ట్ మూవీ”హలో”. ఈ మూవీ ట్రైలర్ చూస్తుంటే సినిమా పాజిటివ్ గా ఉంటుంది అని తెలుస్తుంది. అక్కినేని అఖిల్ హీరో గా నటించిన ఈ మూవీ లో కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీ గా ఉన్న ఈ మూవీ డిసెంబర్ 22 న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది.

NEWS UPDATES

CINEMA UPDATES