ముచ్చటగా మూడో సినిమాకు రెడీ

237

విరించి వర్మ.. టాలీవుడ్ లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు. మొదటి సినిమా ఉయ్యాల జంపాలతో తన రూటేంటో చూపించాడు. సెన్సిబుల్ సినిమాలు తీయడంలో స్పెషలిస్ట్ అనిపించుకున్నాడు. తర్వాత నానితో మజ్ను సినిమా చేసి మరో హిట్ కొట్టాడు. ఆ మూవీ కూడా సెన్సిబుల్ లవ్ స్టోరీనే. లవ్ స్టోరీస్ లోనే డిఫరెంట్ ఎటెంప్ట్. ఇప్పుడీ దర్శకుడు ముచ్చటగా మూడో సినిమాకు రెడీ అవుతున్నాడు.

ఈసారి కూడా లవ్ స్టోరీనే ఫిక్స్ చేశాడు. కథ అనుకోవడే కాదు, స్క్రీన్ ప్లే కూడా లాక్ చేసుకున్నాడు. ఎమ్ ఎల్ కుమార్ చౌదరి నిర్మాణంలో ఈ సినిమా రాబోతోంది. కీర్తి కంబైన్స్, పద్మజ పిక్చర్స్ సంయుక్తంగా సమర్పించనున్న ఈ సినిమాలో నాగచైతన్య నటించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

ప్రస్తుతం విరించి, చైతూ మధ్య స్టోరీ డిస్కషన్లు జరుగుతున్నాయి. ఈమధ్యే సవ్యసాచి సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చాడు చైతూ. వచ్చేనెల నుంచి మారుతి దర్శకత్వంలో సినిమా కూడా స్టార్ట్ చేయబోతున్నాడు. సవ్యసాచి ఓ కొలిక్కి వచ్చిన వెంటనే విరించి మూవీ స్టార్ట్ అవుతుంది.

NEWS UPDATES

CINEMA UPDATES