తెలుగు టైటిల్ ఫిక్స్ చేసిన విశాల్

300

డిటెక్టివ్ తో తెలుగులో కూడా డీసెంట్ హిట్ అందుకున్నాడు విశాల్. సినిమాకు కలెక్షన్లు రాకపోయినా చూసిన ప్రతి ఒక్కరు బాగుందంటున్నారు. ఇదే ఊపులో మరో సినిమాను సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నాడు విశాల్. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో ఇరింబు తెరై అనే సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు తెలుగు టైటిల్ కూడా ఫిక్స్ చేశాడు విశాల్.

తెలుగులో అభిమన్యుడు పేరుతో రాబోతోంది ఇరుంబు తెరై సినిమా.  ఇందులో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేయాలనేది విశాల్ టార్గెట్. తెలుగులో సాధ్యంకాకపోయినా కనీసం కోలీవుడ్ లో అయినా ఆ టైమ్ కు వద్దామని చూస్తున్నాడు.

ఈ సినిమాకు కూడా ఎప్పట్లానే తనే నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు విశాల్. ఇందులో విశాల్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. యాక్షన్ కింగ్ అర్జున్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఒకప్పుడు విశాల్ కు గురువు అర్జునే.

NEWS UPDATES

CINEMA UPDATES