కొడుకు కోసం కొత్త విలన్ ని పట్టిన పూరి జగన్నాధ్

326

డైనమిక్ డైరెక్టర్ అయిన పూరి జగన్నాధ్ గ్యాంగ్ స్టార్స్ బేస్డ్ సినిమాలు తీయడం లో దిట్ట. కాని గత కొన్ని ఏళ్ళ నుంచి అవే సినిమాలు పూరి ని సక్సెస్ నుంచి దూరం చేసాయని చెప్పొచ్చు. రీసెంట్ గా “పైసా వసూల్” తో ఫ్లాప్ ని అందుకున్న పూరి జగన్నాధ్ తన తదుపరి మూవీ ఒక రొమాంటిక్ లవ్ స్టొరీ ని తెరకేక్కిస్తున్నాడు. ఈ మూవీ తో తన కొడుకు అయిన ఆకాష్ పూరికి మంచి హిట్ ఇచ్చే పనిలో ఉన్నాడు పూరి. అయితే ఈ మూవీ లో ఆకాష్ ని డీ కొట్టే ప్రత్యర్ది పాత్ర కోసం ఒక కొత్త కుర్రాడిని దింపాడు పూరి. హైదరబాద్ కి చెందినా విష్ణు రెడ్డి అనే యువకుడిని ఈ మూవీ ద్వారా విలన్ గా పరిచయం చేస్తున్నాడు పూరి. ఎప్పుడూ తెలుగు విలన్స్ ని కాకుండా బయట విలన్స్ ని తీసుకునే పూరి ఫస్ట్ టైం ఒక తెలుగు కుర్రాడికి విలన్ గా ఛాన్స్ ఇచ్చాడు. మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందిన విష్ణు రెడ్డి 2009 లో మిస్టర్ సౌత్ ఇండియా గా ఎంపికయ్యాడు. మొత్తానికి కొడుకు కోసం కొత్త హీరోయిన్ అయిన నేహ శెట్టి ని అలాగే కొత్త విలన్ అయిన విష్ణు రెడ్డి ని దింపి ఏదో మేజిక్ చేసే పనిలో ఉన్నాడు పూరి.

NEWS UPDATES

CINEMA UPDATES