చెర్రి సినిమా కోసం 3 కోట్లు తీసుకుంటున్న బాలీవుడ్ విలన్

323

యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్ దర్శకుడు బోయపాటి శ్రీను, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల మూవీ ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతుంది. తొలి షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ మూవీ రెండవ షెడ్యూల్లో ఉంది. ఈ మూవీ లో రామ్ చరణ్ కి విలన్ గా బాలీవుడ్ నటుడు అయిన వివేక్ ఒబెరాయ్ ని తీసుకున్నారు మూవీ యూనిట్. అయితే ఈ మూవీ కోసం వివేక్ ఒబెరాయ్ ప్రొడ్యూసర్స్ దగ్గర అక్షరాల మూడు కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ గా తీసుకున్నాడు అని తెలుస్తుంది.

ఇప్పుడు జరుగుతున్న రెండవ షెడ్యూల్లోనే చరణ్, వివేక్ ల కాంబినేషన్ సీన్స్ చిత్రీకరిస్తారట. దేవిశ్రీ సంగీతం అందించనున్న ఈ మూవీ లో కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా తమిళ్ హీరో అయిన ప్రశాంత్ రామ్ చరణ్ కి అన్నగా, స్నేహ రామ్ చరణ్ కి వదినగా నటిస్తున్నారు. డీవివి దానయ్య ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

NEWS UPDATES

CINEMA UPDATES