కేరళలో నీటి కష్టాలు….. ఆ వరద నీరంతా ఎటుపోయింది?

1334

కేరళ…. ప్రకృతి కనువిందు చేసే అద్భుత ప్రాంతం…. పశ్చిమ కనుమలతో ఈ రాష్ట్రానికి నీటికష్టాలు తీరుతున్నాయి. ఈ కనుమల్లో పడే భారీ వర్షాలతో కేరళ సస్యశ్యామలం అవుతుంది.

అయితే ఈ మధ్య కొండల్లో గ్రానైట్, మైనింగ్ వల్ల ప్రకృతి సమతౌల్యం దెబ్బతిని భారీ వర్షాలకు వరదలు పోటెత్తి ఊళ్ళను ముంచేశాయి. అందరినీ నిరాశ్రయులను చేశాయి. దాదాపు 60శాతం ప్రాంతం నీటిలో మునిగిపోయింది. అంతా అయిపోయింది. ఆగస్టులో వచ్చిన వరద ఇప్పుడు తగ్గిపోయింది.

ఆశ్చర్యకరంగా ఇప్పుడు సెప్టెంబర్ లో జలాశయాల్లో నీరు తగ్గిపోయింది. పెరియార్‌, కంబనీ, పంపా నదుల్లో నీటి మట్టం ఎప్పుడూ లేనంత తక్కువ స్థాయికి పడిపోయింది. చాలా గ్రామాల్లో బావులు ఎండిపోయాయి. భూగర్భజలాలు పాతాళానికి చేరాయి.

పొడి ప్రాంతాల్లో దాదాపు ఎండిపోయిన పరిస్థితి. పోయిన నెలకు.. ఇప్పటి నెలకు చాలా తేడా ఉంది. మరి అంత ఉధృతంగా ఉప్పొంగిన నీరు ఇప్పుడే మైంది.? ఆ నీరంతా ఎటుపోయిందనే సందేహం ప్రజలకు…. అక్కడి ప్రభుత్వానికి వచ్చింది.

శతాబ్ధంలోనే అతిపెద్ద వరదలు వచ్చినా కానీ…. ఈ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో రాష్ట్రంలోని భూగర్భ జలాలు స్థాయి వేగంగా క్షీణించడంతో ఈ గుట్టు తెలుసుకోవాలని తాజాగా కేరళ ప్రభుత్వం పరిశోధనా సంస్థలకు ఆదేశాలిచ్చింది.

NEWS UPDATES

CINEMA UPDATES