ఆ విష‌యంపై ఇక మాట్లాడ‌ను

543

అమిత్ షా త‌న‌యుడు జ‌య్ షా పై …ది వైర్ వెలువ‌రించిన క‌థ‌నం దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపింది. ఆ క‌థ‌నం కాంగ్రెస్‌కు గొప్ప ఆయుధంగా ఉప‌యోగ‌ప‌డింది. కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ ఈ క‌థ‌నాన్ని ప్ర‌స్తావిస్తూ అమిత్ షాను, మోడీని ఇర‌కాటంలో పెట్టారు. ప‌దునైన ట్వీట్ల‌తో బిజెపి ప‌రువు తీసారు.

అమిత్ షా కుమారుడి కంపెనీల‌కు సంబంధించి ఇక నుంచి మాట్లాడ‌న‌ని తాజాగా రాహుల్ గాంధీ ప్ర‌క‌టించారు. దీనికి కార‌ణం అల‌హాబాద్ రూర‌ల్ కోర్టు వెలువ‌రించిన మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులే.

జ‌య్ షా పై ఎటువంటి క‌థ‌నాలు ప్ర‌చురించ వ‌ద్ద‌ని అల‌హాబాద్ రూర‌ల్ కోర్టు ది వైర్ అనే న్యూస్ పోర్ట‌ల్‌కు తెలిపింది. దీంతో రాహుల్ గాంధీ ట్విట్ట‌ర్ ద్వారా స్పందించారు.

కోర్టు ఉత్త‌ర్వుల‌ను ప్ర‌స్తావిస్తూ ఇక నుంచి తాను జ‌య్ షా విష‌య‌మై మాట్లాడ‌న‌ని, త‌న మిత్రులు కూడా మాట్లాడ‌కుండా ఉంటే మంచిద‌ని రాహుల్ ట్వీట్ చేశారు.

జ‌య్ షా త‌ర‌పున భార‌త అద‌న‌పు సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ తుషార్ మెహ‌తా ఈ కేసును వాదిస్తున్నారు. ది వైర్ అనే న్యూస్ పోర్ట‌ల్‌పై ప‌రువు న‌ష్టం దావా వేశారు.

బిజెపి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత అమిత్ షా త‌న‌యుడు జ‌య్ షా కంపెనీలు గ‌ణ‌నీయ‌మైన లాభాలు ఆర్జించాయ‌ని ది వైర్ ప్ర‌చురించింది. 50 వేల నుంచి 80 కోట్ల‌కు కంపెనీ ట‌ర్నోవ‌ర్ పెరిగింద‌ని ఈ క‌థ‌నంలో ప్ర‌ముఖంగా ప్ర‌స్తావించింది. ఈ విష‌యమై గ‌త ప‌ది రోజులుగా దేశంలో తీవ్ర గంద‌ర గోళం నెల‌కొంది.

అల‌హాబాద్ కోర్టు మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వుల‌తో ఆరోప‌ణ‌ల ప‌ర్వానికి తాత్కాలిక విరామం క‌ల‌గ‌నుంది.

NEWS UPDATES

CINEMA UPDATES