లేడీస్ స్పెష‌ల్ ట్రైన్‌కు 26 ఏళ్లు

4402

ప్ర‌పంచంలోనే మొట్ట‌మొద‌టి సారిగా మహిళ‌ల కోసం ఏర్పాటు చేసిన ప్ర‌త్యేక రైలు స‌ర్వీస్ 26 ఏళ్లు పూర్తి చేసుకుంది. వెస్ట్ర‌న్ రైల్వే ప‌రిధిలో మే 5, 1992లో లేడీస్ స్పెష‌ల్ స‌బ‌ర్బ‌న్ ట్రైన్ ప్రారంభ‌మ‌యింది. నేటికీ విజ‌య వంతంగా న‌డుస్తోంది.

మ‌హిళ‌ల‌కు ఎంతో సౌక‌ర్య‌వంతంగా ఉండేలా సేవ‌లందిస్తోంది. ఈ ప్ర‌త్యేక సంద‌ర్భాన్ని గుర్తుచేసుకుంటూ రైల్వే సిబ్బంది ప్ర‌యాణికుల‌కు రోజా పువ్వుల‌తో స్వాగ‌తం ప‌లికారు. ఫీడ్‌బ్యాక్ ప‌త్రాలు అందించి వారి అభిప్రాయాల‌ను కోరారు.

రైల్వే శాఖ ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని ఓ స్టేట్ మెంట్ విడుద‌ల చేసింది. ప్రారంభించిన తొలి రోజుల్లో కేవ‌లం రెండే డైలీ స‌ర్వీసెస్ ఉండేవ‌ని…. ఆద‌ర‌ణ పెరుగుతున్న కొద్దీ వాటి సంఖ్య‌ను ఎనిమిదికి పెంచామ‌ని అధికారులు తెలిపారు. ఉద‌యం పూట నాలుగు స‌ర్వీసులు, సాయంత్రం వేళ‌ల్లో నాలుగు స‌ర్వీసెస్‌లు ప్రారంభించిన‌ట్లు రైల్వే అధికారులు గుర్తుచేసుకున్నారు.

మొద‌ట్లో చ‌ర్చిగేట్ నుంచి బోరివాలీ స్టేష‌న్ వ‌ర‌కు సేవ‌లు ఉండేవి. 1993లో విరార్ వ‌ర‌కు ఆ సేవ‌ల‌ను విస్త‌రించారు. అప్ప‌టి నుంచి ఆ లేడీస్ స్పెష‌ల్ ట్రైన్ ల‌క్ష‌లాది మంది మహిళ‌ల‌కు నేస్తంగా మారింద‌ని అధికారులు తెలిపారు.

ప్ర‌స్తుతం ప‌శ్చిమ రైల్వే అధికారులు బోరివ‌లి, బ‌యాంద‌ర్‌, వ‌సాయి రోడ్‌, విరార్ స్టేష‌న్ల నుంచి చ‌ర్చిగేట్ వ‌ర‌కు స‌ర్వీసుల‌ను న‌డుపుతున్నారు. తిరిగి సాయంత్రం వేళల్లో చ‌ర్చిగేట్ నుంచి బోరివ‌లి, బ‌యాంద‌ర్‌, వ‌సాయ్ రోడ్, విరార్ స్టేష‌న్ల‌కు ర‌ద్దీ స‌మయాల్లో సేవ‌లందిస్తున్నారు.

NEWS UPDATES

CINEMA UPDATES