యూపీ ముఖ్యమంత్రికి పెళ్లి చేసిన అంగన్‌వాడీ కార్యకర్తలు?

372

ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో అంగ‌న్‌వాగీ కార్య‌కర్త‌లు వినూత్న నిర‌స‌నకు దిగారు. త‌మ గోడు ప్ర‌భుత్వానికి వినిపించేందుకు సీతాపూర్‌లో ఆందోళ‌న చేప‌ట్టారు. ముఖ్య‌మంత్రి ఆదిత్యానాథ్ మాస్క్ ధ‌రించిన ఒక మ‌హిళ‌తో మ‌రో మ‌హిళ‌కు వివాహం జ‌రిపించారు. మంత్రోచ్ఛార‌ణ‌ల‌తో, బాజా భ‌జంత్రీల‌తో ఈ స‌ర‌దా పెళ్లిని జ‌రిపించారు.

మ‌హిళా అంగ‌న్‌వాడీ క‌ర్మ‌చారీ సంఘ్ అధ్య‌క్షురాలు నీతూ సింగ్ పెళ్లికూతురు అవ‌తారం ఎత్తింది. సీఎం ఆదిత్యానాథ్ మాస్క్ ధ‌రించిన మ‌హిళ మెడ‌లో సిగ్గు పడుతూ దండ‌వేసింది. ప్ర‌భుత్వ దృష్టిని ఆక‌ర్షించ‌డానికే తామీ ప‌ని చేస్తున్న‌ట్లు నీతూసింగ్ తెలిపింది.

త‌మ డిమాండ్ల‌ను ప‌రిష్క‌రిస్తే 4 ల‌క్ష‌ల మ‌హిళ‌ల‌కు మేలు జ‌రుగుతుంద‌ని ఆమె తెలిపింది. త‌మ డిమాండ్ల‌ను వీలైనంత త్వ‌రంగా ప‌రిష్క‌రించాల‌ని ఆమె కోరింది. లేక‌పోతే తాను ఏకంగా గుర్రం ఎక్కి ముఖ్య‌మంత్రిని క‌ల‌వ‌డానికి వెళ‌తాన‌ని హెచ్చ‌రించింది.

త‌మ డిమాండ్ల ప‌రిష్కారానికి ప్ర‌భుత్వానికి నాలుగు నెల‌ల గ‌డువు ఇచ్చామ‌ని….8 నెల‌లు గడుస్తున్నా స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కాలేద‌ని ఆమె తెలిపింది. మ‌రోవైపు త‌మ‌పై విచ‌క్ష‌ణా ర‌హితంగా లాఠీ దెబ్బ‌ల‌తో కొట్టి అవ‌మాన ప‌రిచార‌ని కూడా ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేసింది.

NEWS UPDATES

CINEMA UPDATES