జ‌గ‌న్ ఇమేజ్ పెరిగిందా…. మ‌ళ్లీ ఆయన వస్తున్నాడు

3565
ys jagan padayatra pawan kalyan sakshi interview people problems tadipatri

వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర రెండు జిల్లాల్లో పూర్త‌యింది. అనంత‌పురం జిల్లా తాడిప‌త్రి నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌వేశించింది. మ‌హిళలు, రైతులు, యువ‌త‌ను క‌లుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ క్ర‌మంలోనే అలుపెరుగ‌ని యాత్రికుడిలా ముందుకు సాగుతున్నారు. ఇటు ఇన్నాళ్లు మౌనంగా ఉన్న జ‌గ‌న్ మీడియాతో ఇంటరాక్ట్ అవుతున్నారు. లోక‌ల్ జ‌ర్న‌లిస్టులతో మాట్లాడి స‌మ‌స్య‌లు తెలుసుకుంటున్నారు. మ‌రోవైపు త‌న‌ను క‌ల‌వ‌డానికి వ‌చ్చిన జ‌నం బాధ‌ల‌ను ఓపిగ్గా వింటున్నారు. పాద‌యాత్ర ప్రారంభ‌మై 26 రోజులైంది. అప్పుడే అంద‌రికీ కొత్త జ‌గ‌న్ క‌నిపిస్తున్నాడు. ఇన్నాళ్లు టీడీపీ ప్ర‌చారం చేసిన జ‌గ‌న్‌కు …ఇప్పుడు స్వ‌యంగా త‌మ మ‌ధ్య తిరుగుతున్న జ‌గ‌న్‌కి జ‌నం తేడా గుర్తిస్తున్నారు.

మ‌రోవైపు మీడియాకు జ‌గ‌న్ ఇంట‌ర్వ్యూలు ఇవ్వ‌డం మొద‌లెట్టాడు. ఇందులో భాగంగా సాక్షికి ఇచ్చిన ఇంట‌ర్వ్యూ బుధ‌వారం రాత్రి ఏడుగంట‌ల‌కు ప్రసారం కాబోతుంది. తొలిసారి ప‌లు అంశాల‌పై తెలుగు జ‌ర్న‌లిస్టులతో జ‌గ‌న్ త‌న అనుభ‌వాల‌ను పంచుకోబోతున్నాడు. 26 రోజుల పాద‌యాత్ర‌లో తాను చూసిన అంశాల‌ను జ‌నం ముందు ఉంచ‌బోతున్నాడు. ఈ టైమ్‌లోనే చ‌లోరో చ‌లోరో అంటూ ప‌వ‌న్ క‌ల్యాణ్ బ‌య‌లుదేరాడు. ఆక్టోబ‌ర్ నుంచి జ‌నంలోకి వ‌స్తాన‌ని చెప్పిన ఆయ‌న నెల‌రోజులు లేట్‌గా విశాఖ టూర్ పెట్టుకున్నాడు. అదీ మోదీకి వ్య‌తిరేకంగా జ‌రుగుతున్న కార్య‌క్ర‌మంలో పాల్గొన‌బోతున్నాడు. కేంద్రం తీసుకున్న ప్రైవేటీక‌ర‌ణ నిర్ణ‌యానికి వ్య‌తిరేక ప్ర‌ద‌ర్శ‌న‌లో పాల్గొంటాడు. ఇక్క‌డ చంద్ర‌బాబుకు సంబంధం లేదు.

అయితే ప‌వ‌న్ ఈ టైమ్‌లో ఎంట్రీపై కొన్ని సందేహాలు మొద‌ల‌య్యాయి. జ‌గ‌న్ పాద‌యాత్ర‌పై ప్ర‌జ‌ల్లో పాజిటివ్‌నెస్ ఏర్ప‌డింది. మెల్ల‌మెల్ల‌గా పునాదుల ఏర్పడుతున్నాయి. ఇదే కొన‌సాగితే జ‌గ‌న్ గ్రాఫ్ పెరుగుతోంది. దీంతో టీడీపీకి న‌ష్టం .అంటే జ‌గ‌న్ ప్ర‌చారాన్ని తగ్గించాలంటే మ‌ళ్లీ ప‌వ‌న్ రంగంలోకి దిగక త‌ప్ప‌దా అన్న‌ట్లు ఆయ‌న ఎంట్రీ చూస్తే అర్ధ‌మవుతోంది. జ‌గ‌న్ కార్యక్ర‌మం ఏదైనా హిట్ అయితే దాని ప్రభావం తగ్గించడానికి ప‌వ‌న్ ఎంట్రీ ఇస్తాడ‌నే నానుడి స్థిర‌ప‌డింది.

NEWS UPDATES

CINEMA UPDATES