ఆళ్ల‌గ‌డ్డ‌లో పేలిన జ‌గ‌న్ పంచ్‌

2437

కృష్ణాన‌దిలో జ‌రిగిన బోటు ప్ర‌మాదంపై జ‌గ‌న్ స్పందించారు. తొలి రెండు రోజుల్లో స్పందిస్తే విషాదంపై కూడా రాజ‌కీయం చేస్తార‌ని అంటార‌ని మిన్న‌కున్న జ‌గ‌న్‌…. పాద‌యాత్ర‌లో ఆళ్ల‌గ‌డ్డ‌లో జరిగిన బ‌హిరంగ‌ స‌భ‌లో చంద్ర‌బాబు స‌ర్కార్‌పై విరుచుకుప‌డ్డారు. ఆయ‌న ఏమ‌న్నారంటే…. దీన్ని కూడా రాజ‌కీయం చేస్తార‌ని అంటారు కాబ‌ట్టి మొద‌టి రెండు రోజులు ఏమీ మాట్లాడ‌లేదు. కానీ ప్ర‌భుత్వం అత్యంత నిర్ల‌క్ష్యంగా అసెంబ్లీలో జ‌స్ట్ సంతాపం తెలిపి చేతులు దులుపుకున్నది. ఏం చంద్ర‌బాబూ? ఆ బోటు డ్రైవ‌ర్‌కు అస‌లు లైసెన్స్ లేదట! నువ్వు అక్ర‌మంగా ఉంటున్న క‌ర‌క‌ట్ట నివాసానికి కూత వేటు దూరంలో ఈ సంఘటన జ‌రిగితే ఏం చేశావు? పోనీ నువ్వూ నీ కొడుకు లైసెన్స్ లేని పైల‌ట్ విమానం న‌డిపితే వెళ్తారా? అస‌లు అనుమ‌తి లేదంటున్నావ్ క‌దా? మ‌రి అనుమ‌తి లేని బోటుకు అంత‌గా రేట్లు పెట్టి టికెట్లు ఎలా ఇచ్చారో చెప్పు అంటూ ప్ర‌శ్నించారు.

అలాగే ప్ర‌మాదాలు జ‌రిగిన‌పుడు క‌మిష‌న్‌లు వేసి చేతులు దులుపుకోవ‌డం చంద్రబాబుకు అల‌వాట‌ని జ‌గ‌న్ దెప్పి పొడిచారు. పాత ఘ‌ట‌న‌ల‌పై వేసిన క‌మిష‌న్‌లు ఏమ‌య్యాయ‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. గతంలో గోదావరి పుష్కారాల్లో 29 మంది చనిపోయారు. చంద్రబాబు సినిమా షూటింగ్‌లో హీరోగా కనిపించడం కోసం వీఐపీ ఘాట్‌లో స్నానం చేయకుండా ప్రజల ఘాట్‌లోకి వెళ్లారు. సీఎం వస్తున్నారని ప్రజలను ఆపేశారు. ఆ తర్వాత బాబు గంటసేపు స్నానం చేశారు. సినిమా షూటింగ్‌ తీస్తూ ఎఫెక్ట్‌ కోసం ఒకేసారి ప్రజలను వదిలారు. ఆ తొక్కిసలాటలో 29 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి బాధ్యులు చంద్రబాబు కాదా అని అడుగుతున్నా? దీనిపై కమిషన్‌ వేశారు. ఆ రిపోర్ట్‌ ఏమైంది? కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌పై కమిషన్‌ వేశారు అది ఏమైంది? ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్‌పై ఎంపీ, ఎమ్మెల్యే దౌర్జన్యం చేస్తే యాక్షన్ తీసుకోలేదు. ఏది జరిగినా కమిటీ, కమిషన్‌ పేరుతో కాలయాపన చేస్తున్నారు. ఇసుక, బొగ్గు, మద్యం…. ఇలా చంద్రబాబు చేయని మాఫియా లేదంటూ జ‌గ‌న్ విమ‌ర్శించారు.

NEWS UPDATES

CINEMA UPDATES