✓ గిడ్డి ఈశ్వరిపై జగన్ సంచలన వ్యాఖ్యలు

2672

వైఎస్‌ జగన్‌ సాక్షి టీవీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూలో పలు కీలక అంశాలపై స్పందించారు. పార్టీ ఫిరాయింపులపైనా జగన్‌ స్పందించారు. మొన్నటి ఎన్నికల్లో తప్పుడు హామీలు తాను ఇవ్వలేదు కాబట్టి…. ఇప్పుడు ఏ అధికారం లేకపోయినా, తాను సినిమా హీరోను కాకపోయినా ఇంతమంది జనం ఆదరిస్తున్నారని చెప్పారు.

చంద్రబాబు కోట్లు పెట్టి ఎమ్మెల్యేలను తీసుకెళ్తున్నారన్నారు. వారిని జగన్‌ నిలువరించలేకపోతున్నారన్న విమర్శపైనా జగన్ స్పందించారు. గిడ్డి ఈశ్వరి పార్టీ వీడడం బాధకలిగించిందన్నారు. గిడ్డి ఈశ్వరిని తాను కూడా బాగా ఇష్టపడేవాడినన్నారు. ఇప్పుడు మిగిలిన 44 మంది ఎమ్మెల్యేలకు కూడా రోజూ ఆఫర్లు వస్తున్నాయన్నారు. కానీ వారు ఆ ప్రలోభాలను ఎదురించి నిలబడుతున్నారని చెప్పారు. అందుకు వారిని అభినందించాలన్నారు. గిడ్డి ఈశ్వరి మాత్రం వెళ్లిపోయారన్నారు.

ఇప్పుడు తాను ప్రతిపక్షంలో ఉన్నాను కాబట్టి కేవలం నమ్మకంతోనే ఎమ్మెల్యేలు పార్టీలో ఉండాల్సిన పరిస్థితి అన్నారు. గిడ్డి ఈశ్వరి టీచర్‌గా ఉంటే తీసుకొచ్చి టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేను చేశానన్నారు. పార్టీలో ఆమెకు చాలా ప్రాధాన్యత ఇచ్చామన్నారు. మరో ఏడాదిలో వైసీపీ అధికారంలోకి వస్తుందన్నారు. గిడ్డి ఈశ్వరి పార్టీలోనే ఉంటే ఆమె తన పక్కనే ఉండేదంటూ పరోక్షంగా మంత్రి పదవి వచ్చేదని జగన్‌ చెప్పారు. నంద్యాల ఎన్నిక అసాధారణ ఎన్నిక అని అన్నారు.

తాను 13 రోజులు ప్రచారంలో ఉండడం వ్యూహాత్మక తప్పిదమన్న విమర్శను జగన్ తోసిపుచ్చారు. తాను 13 రోజులు అక్కడ లేకుంటే చంద్రబాబు ఏ ఒక్క కార్యకర్తను కూడా మిగిల్చే వాడు కాదన్నారు. తాను అక్కడ ఉన్న సమయంలోనే చిన్నచిన్న నేతలకు 20 లక్షలు, 30 లక్షలు ఇస్తూ కొనేశారన్నారు. కానీ తాను అక్కడే ఉన్నాను కాబట్టి మిగిలిన నేతలు, కార్యకర్తలు ధైర్యంగా పోరాడారని జగన్ చెప్పారు. 13 రోజుల పాటు నంద్యాల ఎన్నికల్లో తాము యుద్ధం చేశామని జగన్ చెప్పారు. డబ్బుతో పాటు టీడీపీకి ఓటేయకపోతే ప్రభుత్వ పథకాలు ఎక్కడ కట్ చేస్తారోనన్న భయంతో నంద్యాల ప్రజలు టీడీపీకి ఓటేశారన్నారు. సాధారణ ఎన్నికల్లో మాత్రం ఆ పరిస్థితి ఉండదన్నారు. ఆ విషయం చంద్రబాబుకు కూడా తెలుసన్నారు జగన్.

NEWS UPDATES

CINEMA UPDATES