ఎన్టీఆర్ కోసం తాగుడు మానేశాడు

తాగుబోతు పాత్రలకు ఎమ్మెస్ నారాయణ తర్వాత ఆ రేంజ్ లో బ్రాండ్ అంబాసిడర్ గా మారాడు తాగుబోతు రమేష్. తన ఇంటిపేరునే తాగుబోతుగా మార్చుకున్న ఈ కామెడీ ఆర్టిస్ట్ ఎన్నో సినిమాల్లో తాగుబోతు పాత్ర పోషించాడు. ఆ పాత్రకే ఓ కొత్త లుక్, కిక్కు తీసుకొచ్చాడు. అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోసం తన తాగుడు పాత్రకు బ్రేక్ ఇచ్చాడు రమేష్. అవును.. ప్రస్తుతం ఎన్టీఆర్ చేస్తున్న నాన్నకు ప్రేమతో సినిమాలో తాగుబోతు రమేష్, తాగుబోతు పాత్రలో కనిపించడు. నిజానికి ఆ పాత్ర తన కెరీర్ ను మలుపుతిప్పుతుందంటున్నాడు ఈ కమెడియన్. సుకుమార్ చెప్పిన ఆ పాత్ర పోషించేందుకు, ఇప్పటికే ఎన్నో సినిమా ఆఫర్లు వదులుకున్నానని కూడా చెబుతున్నాడు. సినిమాలో అంతటి కీలకమైన ఆ పాత్రను సుకుమార్, తాగుబోతు రమేష్ కే ఎందుకిచ్చాడనేది ఒక సందేహమైతే.. ఆ పాత్రకు తాగుడును ఆపాదించకుండా తాగుబోతు రమేష్ తో ఎందుకు తీస్తున్నారనేది మరో పాయింట్. ఈ సందేహాలకు సమాధానాలు సంక్రాంతి రోజున దొరుకుతాయి. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here