Telugu Global
Travel

వర్షాకాలం ప్రయాణాల్లో జాగ్రత్తలు ఇలా..

వర్షాకాలంలో చాలామంది లాంగ్ ట్రిప్స్ ప్లాన్ చేస్తుంటారు. అయితే మాన్‌సూన్ ట్రావెల్.. అనుకున్నంత ఈజీ కాదు. వర్షాల్లో ప్రయాణాలు చేసేటప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎదరవుతాయి.

వర్షాకాలం ప్రయాణాల్లో జాగ్రత్తలు ఇలా..
X

వర్షాకాలం ప్రయాణాల్లో జాగ్రత్తలు ఇలా..

వర్షాకాలంలో చాలామంది లాంగ్ ట్రిప్స్ ప్లాన్ చేస్తుంటారు. అయితే మాన్‌సూన్ ట్రావెల్.. అనుకున్నంత ఈజీ కాదు. వర్షాల్లో ప్రయాణాలు చేసేటప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎదరవుతాయి. అందుకే ప్రయాణానికి ముందే కొన్ని విషయాలు తెలుసుకోవడం ముఖ్యం.

వర్షాకాలం ట్రిప్స్ ప్లాన్ చేసేటప్పుడు వెళ్లబోయే ప్లేస్‌లో ఎలాంటి వాతావరణం ఉండబోతోందో ముందే తెలుసుకోవాలి. వర్షాకాలంలో కొన్ని ప్రదేశాల్లో తుఫాను, వరదల వంటివి వస్తుండొచ్చు. లేదా రోడ్లు పాడయ్యి ఉండొచ్చు. కాబట్టి వెళ్లబోయే ప్రాంతం గురించి, అక్కడి క్లైమెట్ గురించి ముందుగానే తెలుసుకుని బయలుదేరాలి.

మాన్‌సూన్ ట్రిప్స్‌లో ప్యాకింగ్ చాలా స్మార్ట్‌గా ఉండాలి. అంటే తక్కువ లగేజీ తీసుకెళ్తూనే వర్షానికి తడవకుండా ప్లాన్ చేసుకోవాలి. లగేజీలో వాటర్ ప్రూఫ్ బ్యాగులు, రెయిన్ కోట్, గొడుగు, వాటర్ ఫ్రూవ్ షూస్ , ఎలక్టానిక్ గ్యాడ్జెట్ల కోసం వాటర్ ప్రూవ్ కవర్ల వంటివి తీసుకెళ్లాలి.

వర్షాకాలంలో ప్రయాణాలు చేసేటప్పుడు టైం కాస్త అటు ఇటూ అయ్యే అవకాశం ఉంటుంది. రైళ్లు, ఫ్లైట్లు లేట్ అవ్వొచ్చు. వెళ్లిన తర్వాత తిరుగు ప్రయాణానికి లేట్ అవ్వొచ్చు. కాబట్టి ట్రిప్ ప్లాన్ చేసుకునేటప్పుడే రెండుమూడు రోజులు ఎక్స్‌ట్రా పీరియడ్ కేటాయించుకోవాలి. వెయిట్ చేయాల్సి వస్తే అందుకు రెడీగా ఉండాలి.

వర్షాకాలంలో లాంగ్ డ్రైవ్‌కు వెళ్లేవాళ్లు కారు లేదా బైకుని పూర్తిగా చెక్ చేయించుకుని బయలుదేరాలి. రోడ్లపై టైర్లు స్కిడ్ అయ్యే ప్రమాదముంటుంది. కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి. రాత్రిళ్లు, వర్షం కురిసే సమయాల్లో ప్రయాణాలు చేయకపోవడమే మేలు.

టూర్‌‌లో భాగంగా మారుమూల ప్రాంతాలకు వెళ్లేవాళ్లు వర్షాకాలంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. వర్షాకాలంలో మారుమూల ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు లాంటివి సంభవిచొచ్చు. కాబట్టి ట్రాన్స్‌పోర్ట్ ఏర్పాట్లు ఉన్నాయో లేదో ముందుగానే తెలుసుకుని బయలుదేరాలి.

ఇక చివరిగా వర్షాకాలంలో రకరకాల అనారోగ్యాలకు అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకూ సురక్షితమైన నీటిని మాత్రమే తాగాలి. తాజా ఆహారాన్ని తీసుకోవాలి. వెంట మందుల్ని తీసుకెళ్లడం మర్చిపోకూడదు.

First Published:  19 July 2023 12:00 PM GMT
Next Story