అటాక్‌ ఎలా చేయాలో మూడు ముక్కల్లో చెప్పిన వెంకయ్య

హోదాకు బదులు కేంద్రం ఇచ్చిన ప్యాకేజ్‌ను చంద్రబాబు స్వాగతించడంతో పాటు మోదీకి ఫోన్ చేసి కృతజ్ఞతలు కూడా చెప్పారు. కానీ హోదా విషయంలో చంద్రబాబును పక్కనపెట్టి కొన్ని విపక్షాలు బీజేపీని టార్గెట్‌ చేయడం కమలనాథులకు ఆగ్రహం తెప్పించింది. ఈ నేపథ్యంలో రివర్స్‌ అటాక్‌కు కమలదండు సిద్ధమైంది. ప్యాకేజ్‌పై జనం నిరసన వ్యక్తం చేస్తున్న వేళ బీజేపీ నేతలు ఏకంగా విశాఖలో ర్యాలీ నిర్వహించారు. విశాఖ వచ్చిన వెంకయ్యనాయుడికి సూపర్ ప్యాకేజ్ సాధించారంటూ బీజేపీ శ్రేణులు భారీ ర్యాలీతో స్వాగతం పలికాయి.

ఈ సందర్భంగా మాట్లాడిన వెంకయ్యనాయుడు… హోదా వల్ల అస్సలు ఉపయోగమే లేదన్నట్టు మాట్లాడారు. హోదాతో కేంద్రం సాయాన్ని పోల్చి ఇంకేం కావాలని ఎదురు ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా ఏపీని ప్రత్యేకంగా గుర్తించి ప్రత్యేకంగా డబ్బులు ఇచ్చామన్నారు. రెవెన్యూ లోటును భర్తీ చేశాం, పోలవరం 90శాతం నిధులను ఏకంగా 100శాతానికి పెంచేశాం.. హోదాతో సమానంగా అన్ని ఇస్తున్నప్పుడు ఇంకేం కావాలి అని ప్రశ్నించారు. హోదాకు పారిశ్రామిక రాయితీలకు సంబంధమే లేదని చెప్పారు. కాంగ్రెస్ వాళ్లు 35ఏళ్లలో పూర్తి చేయలేని పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు రెండేళ్లలో ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నించారు. పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలిపించింది తానేనని వెంకయ్య చెప్పుకున్నారు. రాష్ట్రపతిని ఒప్పించి ఆర్డినెన్స్ జారీ చేయించానని చెప్పారు. విభజన సమస్యలను ప్రస్తావించింది తానొక్కడినేనన్నారు. మొత్తం మీద ఇకపై ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ శ్రేణులు ఎలా ఎదురుదాడి చేయాలో వెంకయ్య స్పష్టంగానే వివరించారు. ” హోదాకు సమానంగా అన్నీఇస్తున్నాం… ఇంకేం కావాలి?”  అని ఎదురుదాడి చేసేలా ఉన్నారు.

Click on Image to Read:

mudragada-chandrababu-naidu

governor-narasimhan-chandrababu-naidu-1

national-alliance-of-peoples-movements-ramakrishnama-raju

single-women-mumbai

swiss-challenge

sabbam-hari

c-ramachandraiah

janasena-book

pawan-janasena

andhra-pradesh-intellectuals

ntr

pawan

kottapalli-geeta

rajashekar-reddy-ysr

chandrababu-naidu-01

chintakayala-chinna-rajappa

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here