చంచల్‌గూడ జైలుకెళ్లిన వారికి అలాగే అనిపిస్తుంది…

ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజే బెటర్‌ అని ప్రజలకు చెప్పేందుకు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు విజయవాడ వచ్చారు. అక్కడ ఏర్పాటు చేసిన మీటింగ్ లో సుధీర్ఘంగా మాట్లాడారు. హోదా అంటే ఆదా అని అన్నారు. డబ్బులు ఇస్తున్నప్పుడు ఇక హోదాతో ఏం అవసరమని ప్రశ్నించారు. పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ నెంబర్‌ వన్‌గా ఉందంటూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వమే ప్రకటించిందని… హోదా లేకపోయినా పెట్టుబడుల ఆకర్షణ సాధ్యమవుతోందన్న సంగతి దీని ద్వారా నిరూపితమైందన్నారు. రాజధాని నిర్మాణానికి వెయ్యి కోట్లు ఇస్తే అంత తక్కువ మొత్తం ఇస్తారా అని కొందరంటున్నారని వెంకయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. అందిన కాడికి దోచుకుని చంచల్‌గూడ, తీహార్‌ జైళ్లకు వెళ్లిన వారికి వెయ్యి కోట్లు తక్కువ మొత్తంగానే కనిపించవచ్చన్నారు. ప్రత్యేక హోదా సాధ్యం కాదని తెలిసినా తాను అప్పుడున్న వేడిలో పోరాటం చేశానన్నారు. హోదాను బిల్లులో పెట్టి ఉంటే ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రత్యేక హోదా వచ్చేదన్నారు. కానీ కాంగ్రెస్‌ ఆ పని చేయలేదని విమర్శించారు.

విభజన సమయంలో ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ ఎంపీలంతా రాజీనామా చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్నారు. కానీ వారంతా ఆ పనిచేయలేదన్నారు. పురందేశ్వరి మాత్రం ముందే వాసన పనిగట్టి ”అంకుల్ ఏదో జరిగేలా ఉంది” తనతో చెప్పిందన్నారు. కావూరి సాంబశివరావు విభజనను అడ్డుకునేందుకు ప్రయత్నించారని .. కానీ ఆఖర్లో ఆయనకు మంత్రి పదవి ఇచ్చారని గుర్తు చేశారు. మంత్రి పదవి తీసుకోకుండా ఉండి ఉంటే కావూరి ప్రతిష్ట మరోలా ఉండేదన్నారు. హైదరాబాద్‌ రాత్రికి రాత్రి అభివృద్ధి చెందలేదని అన్నారు. 40 ఏళ్ల పాటు వెంగళరావు, రామారావు, వైఎస్‌ఆర్‌, చంద్రబాబు కష్టపడితే, అది కూడా మొత్తం అభివృద్ధిని ఒకే చోట కేంద్రీకరించడం వల్ల హైదరాబాద్ అభివృద్ధి సాధ్యమైందన్నారు. ఎన్టీఏ నుంచి టీడీపీ బయటకు వస్తే మోదీకి వచ్చిన ఇబ్బంది ఏమీ ఉండదన్నారు. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తేనే ఏపీ అభివృద్ధి సాధ్యమన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని పార్టీలకు ప్రత్యేక హోదా కంటే చంద్రబాబు హోదాను తాము సొంతం చేసుకోవాలన్న ఉద్దేశం ఎక్కువగా కనిపిస్తోందన్నారు వెంకయ్య. అంతకుముందు విజయవాడ వచ్చిన వెంకయ్యనాయుడును వామపక్షాలు అడ్డుకునేందుకు ప్రయత్నించాయి. హోదా ఇవ్వనందుకు నిరసన తెలిపారు. అయితే వారిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.

Click on Image to Read:

bhumana-karunakar-reddy

uma-reddy-venkateswarlu

 

chittoor-mayor-katari-anuradha

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here